Sunday, October 6, 2024
spot_img

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, నూతన సంస్థల ఏర్పాటుకు హైదరాబాద్ లో కొదవ లేదు..

తప్పక చదవండి

: చేవెళ్ళ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి
చిత్రకారుడు ‘హరి’ అద్భుత కళాఖండాలను సృష్టిస్తున్నాడు
: డీజీపీ అంజనీ కుమార్
నిరంతర కృషి, పట్టుదలతో ఏ స్థాయికైనా ఎదగవచ్చు
: డాక్టర్ వకుళాభరణం

హైదరాబాద్ లో నూతనంగా సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, స్టార్ట్అప్ ల ఏర్పాటుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని చేవెళ్ళ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి అన్నారు. ఆసియా ఖండంలో ఎక్కడా లేని సౌకర్యాలు, సౌలభ్యాలు హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ వలననే ఇది సాధ్యమయ్యిందన్నారు. గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ “శాంతి సరోవర్,” లో సహాయ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన “ఔత్సాహక పారిశ్రామికవేత్త” లకు “ఎక్సలెన్సీ అవార్డు”ల కార్యక్రమంలో డా॥ రంజిత్ రెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొని పురస్కారాలను రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు తో కలిసి అందచేశారు. ఈ సందర్భంగా సభలో డా॥ రంజిత్ రెడ్డి ప్రసంగిస్తూ… సంకల్పం, నిబద్ధత, కొంగ్రొత్త ఆలోచనలతో పారిశ్రామిక వేత్తలుగా ఎదగడం కష్టమైన పనేమి కాదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నూతన పారిశ్రామిక విధానం, పారిశ్రామిక విప్లవానికి బాటలు వేసిందని పేర్కొన్నారు. ప్రకృతి రమణీయంగా, సహజత్వo ఉట్టిపడేలా చిత్రకారుడు “హరి” గీసిన, తైలవర్ణ చిత్రాలు, అద్భుత కళాఖండాలు అని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ అంజనీ కుమార్ అభివర్ణించారు. చిత్రాలు గీయడంలో చిత్రకారుడి ప్రతిభ గొప్పదన్నారు. సమాజంలో జరిగిన వివిధ సంఘటలను, చూసిన వివిధ అంశాలను అత్యంత ప్రభావంతంగా చిత్రీకరించడం సామాన్యమైనది కాదన్నారు.

- Advertisement -

గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ ‘శాంతి సరోవర్’ లో ఏర్పాటు చేసిన ‘కాన్స్పిషియస్ ఆర్ట్ ఫెస్ట్’ ను డాక్టర్ వకుళాభరణం తో కలిసి తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలనం చేశారు. ఈ ఫెస్ట్ ను సహయ ఫౌండేషన్, వీ.ఎస్.ఎల్. విసువల్ ఇంటర్నేషనల్ ఆర్ట్ గ్యాలరీ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. అనంతరం అంజనీకుమార్, డా॥ వకుళాభరణం లు అక్కడ ఏర్పాటు చేసిన చిత్రకారుడు ‘హరి’ ఆర్ట్ గేలరీ లో చిత్రాలను సందర్శించారు. అంతకు ముందుకు ఒక చిత్ర పటాన్ని (గొర్రె పిల్లను పట్టుకుని నిల్చున్న బాలికతో కూడిన తైలవర్ణ చిత్రం) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అంజనీ కుమార్ ప్రసంగిస్తూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతిదీ చిత్రకారులకు అద్భుత చిత్రాలను, చిత్రీకరించడానికి వీలు కల్గిందన్నారు. సైబరాబాద్ లోని భవంతులు, తీగల వంతెన, సచివాలయం, అమరవీరుల స్తూపం, కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి, పచ్చదనం ఇలా ఎన్నో అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ ప్రగతిని చూస్తుంటే ప్రభుత్వంలో ఈ సందర్భంలో కీలక బాధ్యతల్లో వుండడం తనకొక మరపురాని అనుభూతి అని పేర్కొనారు. సభలో ఆత్మయ అతిథిగా పాల్గొన్న డాక్టర్ వకుళాభరణం ప్రసoగిస్తూ…. తెలంగాణ సకల కళలకు కణాచి గా భాసిల్లుతుందన్నారు. నిరాదరణకు గురైన అన్ని కళారూపాలు పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయి అన్నారు. అవార్డులు పొందిన గ్రహీతలు మరింతగా సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డా. అశిష్ చౌహన్, ఆచార్య చేతన్ శ్రీవాత్సవ, రాం జల్ దుర్గం, రష్మీ ఠాకూర్, డా. శ్రీరాం, డా. రవీందర్, దైవజ్ఞ శర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సమన్వయ కర్తలు అనితహరి, అముటులాలి లూబ్నలు వ్యవహరించారు. కార్యక్రమంలో ఆలపించిన సినీ గీతాలు, శాస్త్రీయ, జానపద నృత్యాలు, మోడలింగ్ క్యాట్ వాక్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు