- ఆసక్తికర కామెంట్స్ చేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్..
- ఈటలపై తప్పుడు ప్రచారం జరుగుతోంది..
- పొంగులేటి, జూపల్లిని బీజేపీలోకి ఆహ్వానించాం..
- తెలంగాణలో కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది..
- పార్లమెంట్ వాస్తు సూపర్ గా ఉంది..
గిట్టని వారే ఓపెనింగ్ కి రాలేదు : అర్వింద్..
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం బీజేపీనే అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తెలంగాణలో ఏ పార్టీకి భవిష్యత్ ఉందని అనుకుంటారో అందులో చేరతారని..ప్రజలకు సేవ చేయాలని అనుకునే వాళ్లు బీజేపీలో జాయిన్ అవుతారని చెప్పారు. ఈటల రాజేందర్ కాంగ్రెస్ లో చేరతారన్న వ్యాఖ్యలను ఎంపీ అర్వింద్ కొట్టిపారేశారు. కాంగ్రెస్ కు అమ్ముడుపోయే కొన్ని పత్రికలు ఈటలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను బీజేపీలోకి ఆహ్వానించామన్నారు.
రాష్ట్రంలో కేసీఅర్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని..రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలు బుద్ది చెప్తారని ఎంపీ అర్వింద్ అన్నారు. ప్రజలు బీజేపీపై నమ్మకం పెట్టుకున్నారని.. ఖచ్చితంగా బీజేపీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చేరికలు, అధికారం ఎవరికి దక్కుతుందని అన్న అంశాలపై బీజేపీ జాతీయ న్యాయకత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఇప్పటికే బీజేపీ జాతీయ న్యాయకత్వం సర్వేలు మొదలు పెట్టిందన్నారు. పార్లమెంటుకు వాస్తు బాగుందని….అందుకే కొన్ని దృష్ట శక్తులు ప్రారంభోత్సవానికి దూరంగా ఉన్నాయని అర్వింద్ చురకలంటించారు.