Saturday, April 20, 2024

నాలా కబ్జాకు జీహెచ్ఎంసీ గ్రీన్ సిగ్నల్ ?

తప్పక చదవండి
  • ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తే పరోక్షంగా సహకరిస్తున్న జీహెచ్ఎంసీ
  • ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా సరే.. చలనం లేని అధికారులు
  • జీహెచ్ఎంసీ అధికారుల వ్యవహారం ప్రభుత్వానికి తెలియదా
  • చందానగర్ గౌతమినగర్ ఓపెన్ నాలా కబ్జా వెనుక జీహెచ్ఎంసీ సహకరం
  • మాజీ జోనల్ కమిషనర్ అనుమతి ఇచ్చారంటూ ఓ ఐఏఎస్ పై తోసేస్తున్న ఇరిగేషన్ అధికారులు
  • ప్రజల ఆస్థిని కొంతమంది కబ్జాచేయడంపై ..ప్రభుత్వానికి బుద్దిచెప్తామంటున్న ఓటర్లు

హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్థులను కబ్జా చేయడం వెనుక జీహెచ్ఎంసీ అధికారుల ప్రోత్సాహం పక్కాగా కనిపిస్తుంది. వారి కనుసన్నల్లోనే పూర్తిస్థాయిలో కబ్జాలు జరుగుతున్నాయి. ఏదో ఖాళీ స్థలం కబ్జా చేస్తే ఎవరికి తెలియదు. కానీ ప్రజలకు ఉపయోగపడే ఓపెన్ నాలాలను సైతం కబ్జా చేసేలా జీహెచ్ఎంసీ అధికారులు ప్రోత్సహిస్తున్నారంటే పరిస్తితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఏకంగా జీహెచ్ఎంసీ అధికారులే, తమకు పర్మిషన్ ఇచ్చారని ఏకంగా కబ్జాదారుడే చెప్తున్న మాటలు, ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి సరైన బుది చెప్తామని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చందానగర్ జీహెచ్ఎంసీ పరిధిలో గౌతమినగర్ లో ఓపెన్ నాలా కబ్జా వ్యవహారంపై వందలాది ఫిర్యాదులు వస్తున్నా..చర్యలు మాత్రం తీసుకునేందుకు జీహెచ్ఎంసీ వెనుకంజ వెనుక వేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శేరిలింగంపల్లిలో ఓపెన్ నాలాలు యథచ్చేగా కబ్జాకు గురవుతున్నా.. జీహెచ్ఎంసీ అధికారులకు చీమ కుట్టనట్లుగా అనిపించడం లేదు. ఏకంగా రెండువందల మీటర్లు మేర ఓపెన్ నాలాను కబ్జా చేసిన ఓ బిల్డర్, తానేమి కబ్జా చేయలేదని ఏకంగా ఓ ఐఏఎస్ అధికారి తనకు అధికారికంగా పర్మిషన్ ఇచ్చింది చెప్ప్తున్నారు. కానీ ఎక్కడా పర్మిషన్ లేదు. ఓపెన్ నాలా కబ్జా విషయంలో ఐఏఎస్ అధికారి పేరు వాడటంతో కబ్జాదారుడి వ్యవహారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఇరిగేషన్ అధికారులు సైతం కబ్జాదారుడికి అండగా నిలుస్తున్నట్లు అక్కడి పరిస్థితులు నిజం చేస్తున్నాయి. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో శేరిలింగంపల్లి అధికార పార్టీ నేతలకు సరైన బుద్ది చెప్తామని చెబుతున్నారు.

- Advertisement -

ఫిర్యాదులపై చలనం లేని జీహెచ్ఎంసీ :
చందానగర్ పోలీసు స్టేషన్ సమీపంలో గౌతమినగర్ దగ్గర ఓపెన్ నాలాపై ఓ బిల్డర్ ప్రేమ చూపించాడు. ఇంకేముంది చందానగర్, శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ అధికారులను చుట్టంలా మార్చుకున్నాడు. ఇరిగేషన్ అధికారులకు సైతం చేతులు తడపడంతో ప్రజలకు ఉపయోగపడే ఓపెన్ నాలాను కబ్జా చేసి, ఏకంగా వంద పీట్ల వరకు రోడ్డు వేసేసుకున్నాడు. స్థానికులు ఎన్నిసార్లు శేరిలింగంపల్లి, చందానగర్ మున్సిపల్ అధికారులకు వందల ఫిర్యాదులు చేసినా, కనీసం అక్కడి అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. సాధారణ వ్యక్తులు గజం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే, నిమిషాల్లో వాలిపోయి హంగామా చేసే జీహెచ్ఎంసీ , బడా బిల్డర్లు వారి వెనుక ఉన్న రాజకీయ నేతల బలాన్ని చూసి చర్యలు తీసుకునేందుకు మాత్రం జంకుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఓపెన్ నాలాను కబ్జా చేసిన బడా బిల్డర్ వెనుక స్థానిక అధికార పార్టీ నేతల సహకారం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఓపెన్ నాల కబ్జా కావడంతో రానున్న వర్షాకాలంలో చుట్టపక్కల ప్రాంతమంతా నీట మునిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆధారాలు చూపని ఇరిగేషన్ ఈఈ :
వందమీటర్ల మేర ఓపెన్ నాల కబ్జాకు గురికావడం వెనుక ఇరిగేషన్ ఈఈ అధికారుల హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నాలా కబ్జా పై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి స్థానిక ఇరిగేషన్ అధికారులను ప్రశ్నిస్తే .. నాలాపై రోడ్డు నిర్మాణానికి శేరిలింగంపల్లి మాజీ జోనల్ అధికారిణి పర్మిషన్ ఇచ్చిదంటూ ఇరిగేషన్ ఈఈ చెప్పడం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పర్మిషన్ కాపీని చూపాలంటూ ప్రశ్నిస్తే అందుకు సమాధానం లేకుండా పోయింది. ఇలా ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయ సహకారంతో ప్రజల ఆస్థి అయిన ఓపెన్ నాలా కబ్జా కు గురై, బిల్డర్ తన ప్లాట్ కు రోడ్డు వేసుకున్నాడు. ఫలితంగా దీనిపై చర్యలు తీసుకునేందుకు మాత్రం ఎవరూ ముందుకు రాలేని పరిస్థితి.

నాలా కబ్జాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు :
చందానగర్ గౌతమినగర్ ఓపెన్ నాలా కబ్జాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు పెద్ద ఎత్తున శేరిలింగంపల్లి జోనల్ అధికారులకు, చందానగర్ సర్కిల్ అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా స్థానిక శేరిలింగంపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ కట్టా వెంకటేష్ గౌడ్ ఫిర్యాదు చేశారు. అంతేకాదు రెవెన్యూ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అయినప్పటికి చర్యలు కనిపించడం లేదు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు