Thursday, May 2, 2024

కాంగ్రెస్‌ ది గతమే తప్ప.. భవిష్యత్తు లేదు

తప్పక చదవండి
  • కాంగ్రెస్‌లో వాళ్ల గొడవలు వాళ్ళకే తప్ప ప్రజల బాధలు పట్టవు.
  • విపక్షాలపై మంత్రి హరీష్‌ రావు పైర్‌
    గజ్వేల్‌ : కాంగ్రెస్‌ ది గతమే తప్ప భవిష్యత్తు లేదు బిజేపి కి రాష్ట్రంలో అసలు స్థానం హే లేదు అని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. శుక్రవారం గజ్వెల్‌ పట్టణం లో 360 మందికి పైగా బిసిలకు బిసి బంధు చెక్కులను లబ్దిదారులకు స్థానిక నేతలతో కలిసి పంపిణీ చేశారు . అనంతరం అయిన మాట్లాడుతూగత ప్రభుత్వ హయాం లో సబ్సిడీ ద్వారా బిసి బందు ఇస్తే బ్యాంకులలో షురిటిల కోసం లబ్ధిదారులకు ఇబ్బంది ఎదురయ్యే పరిస్తితి.ఇదంతా ఆలోచించి ఏటువంటి ఇబ్బంది లేకుండా బిసి బందు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 85 వేల కోట్లు ఇచ్చిందని పార్లమెంటు సాక్షిగా బిజెపి ఎంపీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ను అడ్డుకునే ప్రయత్నం చేసిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం కేసీఅర్‌ త్రాగు ,సాగు నీరు అందించిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం లో రైతుల కళ్ళలో కన్నీరు వస్టే , తెలంగాణ ప్రభుత్వం లో త్రాగు , సాగు నీరు వస్తుందన్నారు. 9 సంవత్సరాల ముందు యెట్లున్న తెలంగాణ ఇప్పుడు ఎలా అయ్యిందని, దక్షిణ భారతదేశం ను ధాన్యాగారం గా మార్చిన ఘనత కేసీఅర్‌ దే అన్నారు. కేసీఅర్‌ లేకుంటే త్రాగు , సాగు నీరు , ఇన్ని పథకాలు వాస్తుండేనా, తెలంగాణ ప్రభుత్వం లో చారణ ప్రైవేట్‌ దవాఖానకు పోతే బారణ సర్కారీ దవాఖానకు పోతున్నారన్నారు. 20 వేల కోట్ల రుణ మాఫీని ఒక్క నెలలో పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. 3 గంటల కరెంట్‌ సాలు అని కాంగ్రెస్‌ వాళ్లు అంటే ,బిజెపి బావుల కడా మీటర్లు పెట్టుమంటారని, కాలం కాకపోయినా కలేస్వరం ప్రాజెక్ట్‌ నీళ్లతో పాండవుల చెరువు నింపిన ఘనత కేసీఆర్‌ దే అన్నారు. కులవృత్తులకు ఇచ్చిన లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, నేతన్నల కు కూడా 3000 వెలు ఇచ్చే కార్యక్రమం రూపొందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్దీసి చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, జడ్పి చైర్పర్సన్‌ రోజా శర్మ తదితరులు పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు