Wednesday, September 11, 2024
spot_img

పెద్దపులి దాడిలో మహిళ మృతి

తప్పక చదవండి
  • చేనులో పత్తి తీస్తున్న మహిళపై దాడి..
  • మహారాష్ట్రలోని అహేరి తాలూకా చింతల్‌పేట్ గ్రామంలో ఘటన

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన చింతలపేట్ లో పెద్దపులి దాడిలో మహిళ మృతిచెందింది. పొలంలో పత్తి తీస్తున్న మహిళపై పెద్ద పులి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. చనిపోయిన మహిళ పేరు సుష్మా దేవిదాస్ మండల్ (55) అని వెల్లడైంది. అటవీ ప్రాంతంలో ఉన్న చేనులో పత్తి తీస్తుండగా ఉదయం 11 గంటల సమయంలో పులి వెనుక నుంచి వచ్చి దాడి చేసింది. తీవ్రంగా గాయపడడంతో సుష్మ మండల్ అక్కడికక్కడే మృతి చెందింది. అయితే పత్తి తీస్తున్న మహిళలు భయంతో కేకలు వేయడంతో పులి అడవిలోకి వెళ్లిపోయింది. మృతురాలు గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ వ్యవసాయ పనులకు వెళ్తుండేదని గ్రామస్తులు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు