Monday, May 6, 2024

వేదపాఠశాల విద్యార్థులతో క్రికెట్‌ ఆడిన అయ్యర్‌..

తప్పక చదవండి

ఐపీఎల్‌ స్టార్‌ ఆటగాడు, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ దోతీ కట్టులో క్రికెట్‌ ఆడాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 16వ సీజన్‌లో తన బ్యాటింగ్‌తో అయ్యర్‌ అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో మొత్తం 14 ఇన్నింగ్స్‌లో 404 పరుగులు చేసిన అయ్యర్‌.. అందులో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. బ్రెండర్‌ మెకల్లమ్‌ తర్వాత ఐపీఎల్‌లో కేకేఆర్‌ తరఫున శతకం సాధించిన తొలి బ్యాటర్‌గా అయ్యర్‌ నిలిచాడు. అయ్యర్‌ మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరడంలో విఫలమైంది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. కాగా, ఐపీఎల్‌ ముగియడంతో ప్రస్తుతం అయ్యర్‌ వెకేషన్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. తమిళనాడు కాంచీపురంలోని ఓ వేద పాఠశాలను సందర్శించాడు. ఈ సందర్భంగా అక్కడ చదువుకుంటున్న పిల్లలతో కలిసి సరదాగా గడిపాడు. వారితో కలిసి సంప్రదాయ దుస్తులు ధరించి క్రికెట్‌ ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అయ్యర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశాడు. ‘క్రికెట్‌ పట్ల వీరికి ఉన్న ప్రేమ నమ్మశక్యం కానిది. కాంచీపురంలోని వేద పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులతో సరదాగా ఇలా గడిపాను..’ అంటూ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు