Saturday, March 2, 2024

ఈనెల 13లోగా పార్లమెంట్‌పై దాడి చేస్తాం..

తప్పక చదవండి
  • ఖలిస్థాన్‌ తీవ్రవాది పన్నూన్‌ బెదిరింపులు
  • మరోసారి బెదిరింపులకు పాల్పడిన ఎస్‌ఎఫ్‌జే చీఫ్‌
  • 2001 పార్లమెంట్‌ దాడిని గుర్తుచేసిన ఖలీస్థానీ
  • పన్నూ హత్య కుట్రను భగ్నం చేసినట్టు అమెరికా ప్రకటన

ఖలీస్థాన్‌ ఉగ్రవాది, సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ చీఫ్‌ గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ మరోసారి రెచ్చిపోయాడు. 2001 దాడి వార్షికోత్సవం డిసెంబరు 13న లేదా అంతకు ముందే పునాదులతో సహా పార్లమెంట్‌ను కూల్చివేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. తన హత్యకు కుట్రలు చేసిన భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని బెదిరించాడు. ఈ మేరకు 2013లో ఉరితీయబడిన పార్లమెంటు దాడి దోషి అఫ్జల్‌ గురు ఫోటోతో పాటు ‘ఢల్లీి బనేగా ఖలిస్థాన్‌’ (ఢల్లీిలో ఖలీస్థాన్‌ ఏర్పడుతుంది) అనే శీర్షికతో ఒక పోస్టర్‌ ఉన్న వీడియోను విడుదల చేశాడు. ఈనెల 13వ తేదీ లేదా అంతకంటే ముందే భారత పార్లమెంట్‌పై దాడి చేస్తామని బెదిరించాడు. 2001 పార్లమెంట్‌ దాడి దోషి అఫ్జల్‌ గురు పోస్టర్‌ను కూడా అందులో ప్రదర్శించాడు. ఈ వీడియోలో తనని చంపేందుకు భారత ఏజెన్సీలు చేసిన కుట్ర విఫలమైందని అన్నారు. కాగా, డిసెంబర్‌ 13వ తేదీకి పార్లమెంట్‌ భవనంపై ఉగ్రవాదులు దాడి జరిపి 22 ఏళ్లు నిండనుంది. 2001 డిసెంబ్‌ 13వ తేదీకి ఢల్లీిలోని పార్లమెంట్‌ భవనంపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈనెల 4వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. సమావేశాలు జరుగుతన్న వేళ ఇలా ఖలిస్థాన్‌ ఉగ్రవాది నుంచి బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. పన్నూన్‌ బెదిరింపుల వీడియో బయటకు రావడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పార్లమెంట్‌ పరిసరాల్లో సెక్యూరిటీని మరింత టైట్‌ చేశాయి. అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
అండర్‌కవర్‌ పోలీసుతో కలిసి పనిచేశాడని, పన్నూను చంపడానికి డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీకి ఇన్‌ఫార్మర్‌ను నియమించాడని ఆరోపించింది. న్యూయార్క్‌ కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయడానికి ముందు నవంబర్‌ మొదటి వారంలో గుప్తాను అమెరికా అధికారులకు అప్పగించారు. ఈ పరిణామాలతో అమెరికా భారత రాయబారి తరన్‌జిత్‌ సింద్‌ సంధూను గురుద్వారాలో ఖలీస్థాన్‌ సానుభూతిపరులు అడ్డుకుని, పన్నూ హత్యకు కుట్రలు చేశారని దాడికి ప్రయత్నించారు. రెండు నెలల కిందట యూకేలోని భారత రాయబారి విక్రమ్‌ దొరైస్వామికి ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. స్కాట్లాండ్‌ గురుద్వారాలోకి దొరైస్వామి వెళ్తుండగా ఖలీస్థానీ మద్దతుదారులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది.
కాగా, పన్నూన్‌ ఇలా బెదిరింపులకు పాల్పడటం ఇదేమీ మొదటి సారి కాదు. నవంబర్‌లో కూడా ఇలానే బెదిరింపులకు పాల్పడ్డాడు. ఎయిర్‌ ఇండియా విమానాన్ని పేల్చేస్తామని, నవంబర్‌ 19 న ఎయిర్‌ ఇండియా విమానంలో ఎవరూ ప్రయాణించవద్దని పన్నూన్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. నవంబర్‌ 4న విడుదల చేసిన ఓ వీడియోలో పన్నూన్‌ మాట్లాడుతూ.. ‘నవంబర్‌ 19న ఎయిర్‌ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని మేము సిక్కులను కోరుతున్నాం. ఆ రోజు ప్రపంచ దిగ్బంధం ఉంటుంది. మీ ప్రాణాలకు ప్రమాదం’ అని గుర్‌పత్వంత్‌ ఆ వీడియోలో హెచ్చరించారు. అదేవిధంగా నవంబర్‌ 19న ఢల్లీి విమానాశ్రయాన్ని మూసేయనున్నట్టు.. దాని పేరును మార్చనున్నట్టు గుర్‌పత్వంత్‌ చెప్పారు. అదే రోజు క్రికెట్‌ ప్రపంచ కప్‌ ఫైనల్‌ జరుగుతుండటాన్ని గుర్తుచేశారు. ఇజ్రాయెల్‌-పాలస్తీనా యుద్ధం నుంచి మోదీ పాఠాలు నేర్చుకోకపోతే అలాంటి ప్రతిస్పందనే భారత్‌లో ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇటీవలే గుర్‌పత్వంత్‌.. ప్రధాని మోదీకి హెచ్చరికలు చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు