Friday, May 17, 2024

భారతీయుల జుట్టుకు భలే గిరాకీ..

తప్పక చదవండి
  • జుత్తు ఎగుమతుల్లో ఇండియా నెంబర్ వన్..
  • కేశాలతో జరుగుతున్న కోట్ల వ్యాపారం..
  • విగ్ లతోపాటు, కొన్ని రకాల ఔషధాల్లో వినియోగం..
  • అన్నిదేశాల కేశాలకంటే భారతీయ కేశాలే నాణ్యత కల్గి ఉంటాయి..
  • 2022 – 23లో 1401 కోటి 96 లక్షల 73 వేల 800 వందల
    కోట్లు విలువగల మనిషి జుట్టు విదేశాలకు ఎగుమతి అయింది..
  • పార్లమెంట్ లో అధికారికంగా ప్రకటించిన కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ
    సహాయ మంత్రి అనుప్రియ పటేల్..

    హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఎగుమతి అవుతున్న జుట్టు దిగుమతి చేసుకుంటాయి…ఇందులో ఇండోనేషియా అత్యధికంగా 31 శాతం జుట్టుని దిగుమతి చేసుకుంటుంది. ఆ తరువాత ఆస్ట్రియా 16.5శాతం, మయన్మార్ 14.6 శాతం, వియత్నాం, ఇటలీ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. మన దేశం నుండి ఎగుమతి చేసే జుట్టు ఎక్కువగా వేస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఎక్కువ జుట్టును ఎగుమతి చేస్తున్నాయి. మన తలపై జుట్టు ఉన్నంత కాలం ఎంతో కేర్ తీసుకుంటాం.. కానీ ఒక్కసారి సెలూన్ లో కటింగ్ అయింది అంటే అది మనకి వ్యర్థంతో సమానం. కానీ మనం వెస్టేజ్ అనుకున్న మన జుట్టుతో కోట్లాది రూపాయల బిజినెస్ జరుగుతుంది.. పైగా ఇండియన్ హెయిర్ కి ప్రపంచ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా జుట్టును ఎక్కువుగా ఎగుమతి చేసే దేశాల్లో ఇండియా టాప్ లో ఉంది. ఇలా ప్రపంచ దేశాలకు ఎగుమతి అయిన జుట్టుతో ఏం చేస్తారు ఒకసారి చూద్దాం..
    కురులతో కోట్ల ఆదాయం…అవును మీరు వింటున్నది నిజం. మనదేశంలో మనం వెస్టేజ్ అనుకునే మన జుట్టుతో కోట్ల లో వ్యాపారం జరుగుతుంది. సెలూన్ లలో, దేవస్థానలలో మనం వదిలేసే జుట్టుని ప్రైవేట్ వ్యక్తులతో విదేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుంది. ఎగుమతి అయిన జుట్టుతో ఎక్కువగా విగ్ లు, కొన్ని రకాల మెడిసిన్ తో పాటు ఇతర అనేక వస్తువుల తయారీలో ఉపయోగిస్తున్నారు. మన దగ్గర కేజీ జుట్టు అక్షరాల 30వేల రూపాయల పైమాటే.. ప్రపంచ వ్యాప్తంగా జుట్టుని ఎగుమతి చేసే దేశాల్లో ఇండియా 2, 27, 372 షిప్మెంట్ ఎగుమతితో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఇండోనేషియా 29, 230 షిప్ మెంట్ తో 2వ ప్లేస్ లో, చైనా 24, 128 షిప్ మెంట్ లతో మూడో స్థానం లో ఉన్నాయి. హాంకాంగ్, పాకిస్తాన్, బ్రెజిల్ తరవాతి స్థానాల్లో ఉన్నాయి. ఇండియాలో లభించే జుట్టుకి చాలా ప్రాధాన్యత ఉంది. ఇండియాలో లభించే జుట్టుకి ఎంతో నాణ్యత ఉంటుంది.. అందుకే చాలా దేశాల్లో ఇండియన్ హైర్ కి డిమాండ్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఫ్యాషన్ షోలు కాస్మోటిక్ రంగంలో కూడా ఉపయోగించే విగ్గులలో ఎక్కువ భాగం ఇండియన్ హేయిర్ నుండి తయారుచేసినవే.
    ఇలా ఇండియా నుండి ఎగుమతి అయిన జుట్టుతో కోట్ల వ్యాపారం జరుగుతుంది. దాదాపుగా గడిచిన 5 ఏళ్లలో 3 వేల 69 కోట్ల 39 లక్షల 60 వేల 500 రూపాయలు విలువ కలిగిన జుట్టు ఇండియా నుండి విదేశాలకు ఎగుమతి అయింది. కేవలం 2022 – 2023 సంవత్సరంలో 14 వందల ఒక కోట్ల 96 లక్షల 73 వేల 800 వందల కోట్లు విలువ గల మనిషి జుట్టు విదేశాలకు ఎగుమతి అయింది. ఇది పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అధికారికంగా ప్రకటించారు. ఇది కేవలం విదేశాలకు ఎగుమతి జరిగిన లెక్క… కాగా మన దేశంలో కూడా జుట్టుకు ఎంతో డిమాండ్ ఉంది.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు