Sunday, May 19, 2024

చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ విజయదశమి!

తప్పక చదవండి

హిందువుల పండుగలన్నింటిలో అత్యంత ప్రాముఖ్యతను,గొప్పతనాన్ని, మహాత్యాన్ని సంతరించుకున్న అతి పెద్ద వేడుక ఈ దసరా పండుగ.ఈ ఏడు అక్టోబర్ 23 న దేశ వ్యాప్తంగా దసరా పండుగ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. కర్ణాటక రాష్ట్రం లోని మైసూర్ లో ఈ పండగ బాగ నిర్వహిస్తారు. చాముండేశ్వరి ఆలయం లో దసరా పండగ సందర్భంగా వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ వుంది. అనాదిగా హిందువుల పండుగలన్నింటిలో అత్యంత ప్రాముఖ్యతను, గొప్పతనాన్ని, మహాత్యాన్ని సంతరించుకున్న అతి పెద్ద పండుగ ఈ విజయదశమి. ముఖ్యంగా యావత్తు హిందూ ప్రజానీకం ఈ దసరా పండుగను అత్యంత శోభయమానంగా జరుపుకోవడం వెనుక ఎంతో మహాత్యం, మహిమ దాగి వుంది. దసరా పండుగను మంచి పై చెడు సాధించిన విజయానికి ప్రతీకగా భావిస్తారు. ప్రత్యేకంగా ఈ దసరా పండుగ కు 9 రోజులు ముందు ప్రారంభమయ్యే దేవి నవరాత్రులు ఆధ్యాత్మికంగా అత్యంత మహిమన్వితమైనవిగా హిందూ సోదరి, సోదరీమణులు భావిస్తారు. అదేవిధంగా ఈ 9 రోజులు యావత్తు హిందూ సమాజం ఎంతో భక్తి, శ్రద్దలతో ఆ జగన్మాత అయిన దుర్గాదేవిని పూజిస్తూ తమలో దాగి వున్న కామ, క్రోద, మధ, మస్సర, మోహ, లోభ, స్వార్థ, అన్యాయ, అసమానత, అహంకార వంటి దుర్గుణాలను తొలగించి తమకు జ్ఞానోదయం కలిగించి మంచి బుద్ది ని ప్రసాదించమని మనసా, వాచ, కర్మణా అత్యంత త్రికరణ శుద్ధి తో ఆ జగన్మాత ను వేడుకుంటూ వుంటారు. అయితే ఈ విజయదశమి పండుగ వెనుక ఎంతో అత్యంత పురాతనమైన చరిత్ర, వైభవం దాగి వుంది.అంతేగాకుండా ఈ దసరా పండుగ యొక్క గొప్పతనం మూడు ప్రదాన మహిమలతో ముడి పడి వుంది. ఒకటి రావణుడిపై రాముడు సాధించిన అఖండ విజయానికి గుర్తుగా, మరొకటి పాండవులు వనవాసాని కై వెళ్తూ జమ్మి చెట్టుపై ఉంచిన ఆయుధాలను తిరిగి తీసుకోవడానికి గుర్తుగా, మూడవది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలగలిసిన జగన్మాత అయిన దుర్గాదేవి మహిసాసురుడనే రాక్షసుణ్ణి వదించిన దానికి గుర్తుగా ఈ విజయదశమిని యావత్తు హిందూ సమాజం అనాదిగా అత్యంత వైభవంగా, అంచెలంచెల భక్తి భావం తో జరుపుకుంటూ వస్తూ వున్నారు.

ముఖ్యంగా ఈ దసరా పండుగ ఇంతగా అశేష హిందూ భక్తులచే ఆరాధింప పడటానికి కారణం ఘోర తపస్సు గావించి ఏకంగా బ్రహ్మ తోనే వరాలు పొందిన మహిసాసురుడు అనే రాక్షసుడు విపరీతమైన గర్వముతో, అహంకారం తో దేవతలతో ఘోర యుద్ధం గావించి చివరకు ఇంద్ర స్థానాన్ని కైవసం చేసుకుంటాడు.దీంతో దిక్కు తోచని దేవేంద్రుడు ఈ రాక్షసుని పీడ ఎలాగైనా విరగడ గావించాలని ఈ అనంత విశ్వానికే సృష్టికర్తలు అయిన ఆ త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరలను వేడుకున్నాడు. దాంతో ఆ త్రిమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరలు దుర్గాదేవి రూపం లో ఉగ్ర రూపం గావించి మహిసాసురుడితో ఏకంగా 9 రోజులు భీకర యుద్ధం చేసి ఎట్టకేలకు ఆ రాక్షసుణ్ణి 10 వ రోజు వదించారు. అందుకే యావత్తు హిందూ ప్రజానీకం చెడుపై మంచి విజయం సాధించిన రోజుగా,అన్యాయం పై న్యాయం విజయకేతనం ఎగురవేసిన రోజుగా ఈ 10 వ రోజును అత్యంత గొప్ప గా అంగ రంగ వైభవంగ జరుపుకుంటారు.ఏదిఏమైనా ఎవరైతే చెడు ధోరణిలో వెళ్తూ, అన్యాయమైన పంథాలో కొనసాగుతూ, తమకున్న అంగ, అర్ధ బలం తో సామాన్యులను వంచిస్తూ అందలం ఎక్కుతారో వారి వైభవం, అధికారం కొంత కాలమే, చివరకు ఏదో ఓక రోజు ఆ సర్వేశ్వరుని ఆగ్రహానికి, ఉగ్ర రూపానికి వారంతా గురి కావాల్సిందే, ఆ దేవ దేవుడి ముందు తల వంచాల్సిందే.,అంతిమంగా వారు పతనం అయిపోవడం తథ్యం అనే దానికి ప్రబల నమ్మకం ఈ విజయదశమి పండుగ వేడుక. ఏమైనా మంచి నడవడికతో, నీతి నిజాయితీ తో మసలుకునే వారికి, న్యాయమైన పంథాలో ముందడుగు వేసే వారికి తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనా ఆ దేవదేవుని ఆశీర్వాదబలంతో ఏదో ఒక రోజు వారు విజయదుందుబి మ్రోగించడం, ఈ సమాజం లో అందరి చేత మన్ననలు పొందడం తథ్యం. జయహో జగన్మాత దుర్గాదేవి!జయ జయహో విజయ దశమి.దసరాపాడి పంటలు పిల్ల పాపలతో ,ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా సుఖ సంతోషాల తో జీవిద్ధామని అన్ని రంగాలలో విజయం సాధించడానికి ఆ భగవంతుడు శక్తి ఇవ్వాలని మనసా,వాచా కోరుకుందాం.ప్రతీ ఒక్కరూ ఈ పండుగను భక్తి పారవశ్యాన్ని చాటుతూ జరుపుకుని మన సంస్కృతి, సంప్రదాయాలు కాపాడాలని కోరుతూ.

- Advertisement -


– కామిడి సతీష్ రెడ్డీ, 9848445134…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు