-విదేశాల్లో విూరెంతో అనుభవం గడిరచారు
-ఇక్కడ అన్ని రంగాల్లో అభివృద్దికి శ్రీకారం
-డాలస్ నాటా తెలుగు మహా సభల్లో సిఎం జగన్ సందేశం
అమరావతి :వేరే దేశంలో ఉన్నా, ఇంత మంది తెలుగువారు… గొప్పవైన మన సంస్కృతి, సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ చక్కటి ఐకమత్యాన్ని చాటటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని సిఎం జగన్ అన్నారు. మిమ్నల్ని అందరినీ ఒక్కసారి తల్చుకుంటే.. అక్కడ పెద్ద, పెద్ద కంపెనీలలో సీఈఓలగానూ, ఐటీ నిపుణులుగానూ, నాసా వంచి సంస్ధల్లో కూడా సైంటిస్టులగానూ, అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా, అమెరికా ప్రభుత్వంలో కూడా ఉద్యోగులుగా, అక్కడ బిజినెస్‌మెన్‌గా, మంచి డాక్టర్లుగా… రాణిస్తున్న తీరుకు మిమ్నల్ని చూసి మేమంతా ఇక్కడ గర్వపడుతున్నానని అన్నారు. అమెరికాలోని డాలస్‌లో జరుగుతున్న నాటా తెలుగు మహా సభలనుద్దేశించి ముఖ్యమంత్రి వైయస్.జగన్ తన సందేశం ఇచ్చారు. ముఖ్యమంత్రి సందేశాన్ని నాటా సభల్లో ప్రదర్శించారు. నాటా కార్యవర్గానికి మరీ ముఖ్యంగా శ్రీధర్, అనిల్, ప్రేమసాగర్‌తో పాటు అందరికీ నా బెస్ట్ విషెష్ అని ప్రకటించారు. ఆకాశమే హద్దుగా.. ఆకాశాన్ని దాటి వెళ్లాలన్న కోరికతో ఉన్న వారు ఎదగాలంటే, అందుకు వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలన్న తపనతో ఈ నాలుగు సంవత్సరాల కాలంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తేగలిగాం. స్కూళ్లలో ఉన్న మౌలికసదుపాయాల రూపురేఖలన్నీ మారుస్తున్నాం అని విద్‌ఆయరంగ పరంగా చేపట్టిన సంస్కరణలను వివరించారు. పౌర సేవల్ని ఇంటింటికీ డోర్ డెలివరీ చేస్తున్నాడు. పెన్షన్, రేషన్… అన్నీ మన ఇంటి ముంగటికే వచ్చే గొప్ప వాతావరణం మన రాష్ట్రంలో కనిపిస్తుంది.ఇవాళ ప్రతి గ్రామంలోనూ ఒక రైతు భరోసా కేంద్రం కనిపిస్తోంది. పంట విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ ప్రతి రైతును చేయిపట్టుకుని నడిపిస్తున్న గొప్ప వ్యవస్ధ మన గ్రామంలోనే కనిపిస్తుంద న్నారు. ఇంకా నాలుగు అడుగులు వేస్తే మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్‌లు కనిపిస్తాయి. మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ విూద ఇంత ధ్యాస పెట్టిన పరిస్థితి బహుశా ఎప్పడూ చూసి ఉండరు. గ్రామంలోనూ ఒక విలేజ్ క్లినిక్.. దానికి అనుసంధానంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను తీసుకునివచ్చాం. ఎప్పుడూ చూడని విధంగా టెర్షిరీ కేర్‌లో 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. ప్రపంచంలోకి వెళ్ళేందుకు కావాల్సిన ఇంగ్లీష్ భాష పునాదిని మనం గట్టి పరుస్తున్నాం. మొట్టమొదటసారిగా రాష్ట్రంలో రూరల్ ఎకానవిూ సస్టైనబులిటీని ఒక్కసారి గమనించిన్లటైతే… ప్రతి ఒక్కరూ కూడా కన్జూమెన్స్ అయిపోయే పరిస్థితుల్లోకి వెళ్లిపోతే… రేపు పొద్దున ఎవరూ ఉత్పత్తిదారులగా ఎవరూ ఉండని పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది. అలా జరిగితే మనం ఆహార ధాన్యాలను బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితికి అడ్డుకట్ట వేయాలంటే రూరల్ ఎకానవిూ బలపడాలి. మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలోనే ఆర్బీకేల ద్వారా గ్రామస్ధాయిలో పడిరది.ఇవన్నీ గమనిస్తే… రాబోయే రోజుల్లో అన్‌లిమిటెడ్ బ్యాండ్ విడ్త్‌తో ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రతి గ్రామంలోకి వస్తుంది. 75 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో మనకు 6 పోర్టులు నాలుగు లొకేషన్స్‌లో ఉంటే… ఇప్పుడు మరో 4 పోర్టులు వేగంగా నిర్మాణం అవుతున్నాయి. 10 పిషింగ్ హార్బర్ల నిర్మాణమూ వేగంగా జరుగుతుంది. తీరప్రాంతంలో ప్రతి 50 కిలోవిూటర్లకూ ఒక పోర్ట్ లేదా ఫిషింగ్ హార్భర్‌లో ఏదో ఒక నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే కర్నూలులో విమానాశ్రయం ప్రారంభమయింది. విశాఖపట్టణం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా శంకుస్ధాపన చేసుకున్నాం. దేశంలో 11 ఇండస్టియ్రల్ కారిడార్లు పనులు జరుగుతుంటే.. .అందులో 3 ఇండస్టియ్రల్ కారిడార్లు పనులు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. రాష్ట్రం ఇవాళ టాప్ 4,5 స్ధానాల్లో కనిపిస్తుంది.ఇవాళ మన గడ్డ విూద మనందరి ప్రభుతం విద్య, వైద్యం, వ్యవసాయం, ఇళ్ళ నిర్మాణం, రాబోయే తరం పిల్లల అభివృద్ధి, మహిళా సంక్షేమం, వంటి విషయాల్లో పురోగతి చేపట్టాం. ఎన్నో సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్, ఎక్స్‌పోజర్ విూకు ఉంది. ఆంధ్రరాష్టాన్రికి విూరు ఏ రకంగా ఉపయోగపడగలిగితే ఆ రకంగా ఉపయోపడండి. ఆర్ధికంగా అన్న మాటలు కాస్తా కూస్తో… ఉపయోగకరంగా ఉంటాయి కానీ దాన్ని పక్కనపెడితే.. అంతకంటే ఎక్కువగా విూ అనుభవం అవసరం. ఇప్పటికే అభివృద్ది చెందినవరల్డ్‌లో విూరు ఇన్నేళ్లు అక్కడ ఉన్నారు కాబట్టి విూ అనుభవం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అవన్నీ కూడా విూరు ఇంకా ఎక్కువగా ఆంధ్రరాష్ట్రం విూద, మన గ్రామాల విూద ధ్యాస పెట్టగలిగితే మన రాష్టాన్రికి ఉపయోగపడతాయి. ఇది నా తరపు నుంచి విూకు చేస్తున్న విజ్ఞప్తి అని సీఎం తన సందేశం వినిపించారు.