Monday, May 20, 2024

టీ ఎస్ సెట్ ప‌రీక్ష నోటిఫికేష‌న్‌ విడుద‌ల..

తప్పక చదవండి

తెలంగాణ సెట్ కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులకు అలర్ట్‌. ఈ సెట్‌ నోటిఫికేషన్‌ను ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఆగస్టు 29 దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది. ఇక ఈ సెట్‌ పరీక్షను అక్టోబర్‌ 28, 29, 30 తేదీల్లో కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ విధానంలో నిర్వహించనున్నారు. పేపర్-1 పరీక్ష 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2 పరీక్ష 100 ప్రశ్నలకు 300 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష కాల వ్య‌వ‌ధి మూడు గంట‌లు. కంప్యూట‌ర్ బేస్డ్ టెస్టు ప‌ద్ధ‌తిలో ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. అభ్యర్థులు పూర్తి స‌మాచారం కోసం http://telanganaset.org/ లేదా https://osmania.ac.in/ వెబ్‌సైట్‌లు చూడొచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ 28, 29, 30 తేదీల్లో టీఎస్ సెట్ నిర్వహించనున్నారు.
మొత్తం 29 సబ్జెక్టులకు టీఎస్‌ సెట్‌ 2023 పరీక్ష నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత టెస్టు (సీబీటీ) పద్ధతిలో జరిగే పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు.
జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్-1), జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా , మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్.
దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 5, 2023
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 29, 2023
1500/- లేట్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 4, 2023
2000/- లేట్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 9, 2023
3000/- లేట్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 12, 2023
దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్: సెప్టెంబర్ 13, 14 తేదీల్లో ఎడిట్‌ ఆప్షన్ ఉంటుంది.
హాల్ టికెట్ల డౌన్ లోడ్: అక్టోబర్ 20 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
పరీక్ష తేదీలు: అక్టోబర్ 28, 29, 30
పరీక్ష సెంటర్లు: ఆదిలాబాద్ , నిజామాబాద్, విజయవాడ , హైదరాబాద్ , వరంగల్, కర్నూలు , కరీంనగర్, ఖమ్మం, తిరుపతి , మహబూబ్ నగర్, మెదక్, వైజాగ్, నల్గొండ, రంగారెడ్డి కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు