Sunday, May 12, 2024

హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లో విషాదం..

తప్పక చదవండి
  • ఏనుగు దాడిలో యానిమల్ కీపర్ మృతి..
  • యానిమల్ కీపర్ మృతిపై ఎన్నో అనుమానాలు
  • సమగ్ర దర్యాప్తు చేయాలంటున్న కుటుంబ సభ్యులు
  • కీపర్ మృతి ప్రమాద ఘటనగా చెబుతున్న జూ సిబ్బంది

హైదరాబాద్ : హైదరాబాద్ జూ పార్క్‌ లో విషాదం చోటు చేసుకుంది. కేర్ టేకర్ మొహమ్మద్ షాబాజ్(27) విజయ్ అనే పేరుగల మగ ఏనుగుకు ఫుడ్ పెడుతున్న సమయంలో అతనిపై విజయ్ పేరుగల ఏనుగు దాడి చేసింది. దీంతో షాబాజ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను వెంటనే అపోలో డిఆర్డీఓ ఆస్ప త్రికి సిబ్బంది తరలించారు.
అయినా షాబాజ్ ప్రాణాలను కాపాడలేకపోయారు. షాబాజ్‌ను వెనుక నుంచి ఏనుగు బలంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆస్ప త్రిలో చికిత్స పొందుతూ షాబాజ్
మృతి చెందారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్నిఆసుపత్రి వైద్యులు పోస్టుమార్టం కు తరలించారు. అనంతరం ఆయన పార్దీవ దేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు.. షాబాజ్ మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

యానిమల్ కీపర్ మృతిపై ఎన్నో అనుమానాలు :
శనివారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల సమయంలో ఏనుగు దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన అతడిని తోటి సిబ్బంది దగ్గరలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.మృతుడు శాబాజ్ పాతబస్తీ కాలపతర్ లో నివాసం ఉంటున్నాడని తెలిసింది. షాబాజ్ ప్రతిరోజు ఏనుగులకు ఆహారం పెడుతూ ఉంటాడని నిర్వాహకులు చెబుతున్నారు. ఎప్పటిలాగే శనివారం కూడా షాబాజ్ ఏనుగులకు ఆహారం అందించడానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుందని తెలిసింది . దాడి జరిగిన సమయంలోషాబాజ్ గట్టిగా అరవడంతో మిగతా జూ సిబ్బంది వెంటనే స్పందించి ఏనుగులను అక్కడి నుండి తరిమేశారు. గాయాలపాలయిన అతడిని ఆసుపత్రికి తరలించిన ప్రాణాలు కాపాడలేకపోయారు.

- Advertisement -

సిబ్బంది నిర్లక్షమే కారణమంటున్న కుటుంబ సభ్యులు :
ఏనుగులు,పులులు, సింహాలు వంటి పలురకాల జంతువుల సంరక్షణ భాద్యతను నిపుణులైయిన సిబ్బంది పర్యవేక్షణలో జరుగుతుంది. కానీ యానిమల్ కీపర్ ఏనుగులకు ఆహారం పెడుతున్నప్పడు, జంతువుల సంరక్షణ భాద్యతను చూసే అధికారులు అందుబాటులో ఎందుకు లేరని షాబాజ్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యానిమల్ కీపర్ మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని జరిగిన ఘటనపై పూర్తి సమగ్ర దర్యప్తు జరిపించాలని షాబాజ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు