Sunday, June 23, 2024

ఎత్తుకు పైఎత్తు వేయడంలోఈ అక్రమ నిర్మాణదారులు దిట్ట

తప్పక చదవండి
  • నిర్మాణ అనుమతులు ఒకటి నిర్మించేది మరొకటి
  • డొమెస్టిక్‌ అనుమతులు, కమర్షియల్‌ భవనాలు
  • ప్రభుత్వాన్ని మోసం చేయడంలో ఈ అక్రమ నిర్మాణదారులు
  • డిగ్రీ పట్టా పొందారు అంటున్న సామాజిక ఉద్యమకారుడు వేముల కొండల్‌ గౌడ్‌..
    ఎల్బీనగర్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ నిర్మాణాలకు తావు లేకుండా ఎంతో ప్రతిష్టాత్మక తీసుకువచ్చిన చట్టం టి.ఎస్‌.బి.పాస్‌… జి.హెచ్‌. ఎం.సి.ఎల్బీనగర్‌ జోన్‌ సరూర్‌ నగర్‌ సర్కిల్‌ -5 లో అంతులేని అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు కొందరు.. సరూర్‌ నగర్‌ సర్కిల్‌ -5 లో ప్రభుత్వ నిబంధనలు భేఖతారు, చేస్తూ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు… సరూర్‌ నగర్‌ సర్కిల్‌ – 5 పరిధిలోని లక్ష్మీ నగర్‌ కాలనీ, నర్సింహా పురి కాలనీ లో ఓ ఇద్దరు నిర్మాణదారులు టి.ఎస్‌.బి.పాస్‌ నుండి నాలుగు అంతస్తులకు డొమెస్టిక్‌ తో కూడిన నిర్మాణ అనుమతులు తీసుకొని…ఆ భవనాలను పూర్తిగా కమర్షి యల్‌ భవనాలుగా మార్చి… ప్రభు త్వానికి సుమారుగా 70 శాతం మేర పన్ను.. ఏగ్గోడుతున్నారు.. ఈ అక్రమ నిర్మాణాలపై నామమాత్రపు నోటీసులు ఇచ్చి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చేతులు దులుపుకుంటున్న వైనం… లక్ష్మీ నగర్‌ కాలనీ చెందిన నిర్మాణదారుడు ఇటీవల (ఓ.సి. ) ఆక్యుపెన్సి సర్టిఫికెట్‌ కి .. దరఖాస్తు చేసుకున్నాడు…అధికారులు భవనాన్ని పరిశీలించగా నిబంధనల మేరకు భవనాన్ని నిర్మించలేదని ఆగస్టు 3న( ఓ.సి సర్టిఫికెట్‌) రిజెక్ట్‌ చేశారు..కొందరు అక్రమ నిర్మాణదారులు ప్రభుత్వాన్ని చీటింగ్‌ చేయడంలో ఒక్కో నిర్మాణదారుడు ఒక్కో పద్ధతిని అవలంబిస్తున్నారు.. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి…ఈ అక్రమ నిర్మాణదారులు డొమెస్టిక్‌ తో కూడా నిర్మాణ అనుమతులు తీసుకొని కమర్షియల్‌ భవనాలు నిర్మించి ప్రభుత్వానికి రావలసిన ఆదాయాన్ని గండి కొడుతున్నారని… ప్రభుత్వాన్ని చీటింగ్‌ చేయడంలో ఈ అక్రమ నిర్మాణదారులు డిగ్రీ పట్టా పొందారని సామాజిక ఉద్యమకారుడు వేముల కొండల్‌ గౌడ్‌ అంటున్నారు..ఇలా ప్రభుత్వాన్ని హైటెక్‌, సైబర్‌ క్రైమ్‌, తరహాలో మోసం చేస్తున్న అక్రమ నిర్మాణదారుల, గృహ నిర్మాణ అనుమతులను తక్షణమే రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాడు.. లేని యెడల ఈ అక్రమ నిర్మాణాలపై జి.హెచ్‌. ఎం.సి. కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ దృష్టికి తీసుకెళ్తానని అన్నాడు…
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు