Thursday, May 2, 2024

ఐఏఎస్‌.. అయ్యా ఎస్ గా మారిన సోమేశ్‌

తప్పక చదవండి
  • ప్ర‌భుత్వానికి తొత్తుగా మారి అవినీతి సొమ్ముతో స్థిర‌, చ‌రాస్తుల కొనుగోలు..!
  • డీవోపిటి నుంచి అనుమ‌తి లేకుండా 25ఎక‌రాల భూమి కొనుగోలు
  • బీహారీ మూలాలున్న వారు కేసీఆర్ కి ఆత్మబంధువే..
  • బ్యూరోక్రాట్ పదాన్ని తుంగలో తొక్కిన అధికారి..
  • మాజీ చీఫ్ సెక్రెటరీ అవినీతికి అంతం లేదు..
  • అభయం కేసీఆర్ ది.. ఆచరణ సోమేశ్ ది…
  • గ‌త పాల‌నలో అవినీతి అధికారుల‌పై రేవంత్ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోకుంటే మాయ‌ని మ‌చ్చ‌
  • సీఎం దృష్టి సారించాలంటున్న మేధావులు

తెలంగాణాలో ఒగ్గు కథ ఎంతో ప్రాచుర్యం పొందింది.. మనకి బూతులు లాగా వినిపించే పదాల వెనుక ఎంతో ఆవేదన దాగి ఉంటుంది.. ఆవేశం వెలుగు చూస్తుంది.. ఒక చెమట చుక్క వెదజల్లే కష్టాల వాసన తెలంగాణ చిత్రపఠం మీద రంగుల స్వేదాన్ని చల్లుతుంది.. ఒక గొప్ప చారిత్రాత్మక విజయ గాధ వెనుక ఎన్నో జీవితాల కథనాలు దాగి వున్నాయి.. కేసీఆర్ గొప్పగా ప్రచారం చేసుకున్నట్లు.. ఆయనకు అంత సీన్ లేదు.. ఎన్నో వేల త్యాగాల ఫలం భూస్థాపితం అయ్యింది.. అలాంటి నకిలీ చరిత్రలో ఒక‌టి మీ ముందు…

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ సర్కార్ లోని అతిపెద్ద అవినీతి అనకొండ అధికారి.. బిహార్ దొంగల ముఠా గ్యాంగ్ లీడర్ సోమేశ్ కుమార్ మరో అక్రమ బాగోతం బయటపడింది. అధికారంలో ఉన్నన్ని రోజులు అడ్డగోలుగా సంపాదించిన సోమ్మును వెన‌కేసుకుంటున్నారు.. అందుకేనేమో ఇప్పుడు ఒక్కో రూపాయిని బయటకు తీసి కుటుంబ సభ్యుల పేరు మీద ఆస్తులు కొంటున్నారు మన మాజీ సీఎస్ సోమేశ్ కుమార్. ఐఎఎస్ చదవిని ఈయన కనీసం డీవోపీటీ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండానే అక్రమ ఆస్తులు కూడబెట్టేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామ శివారు సర్వేనెంబర్స్ 249, 260లో ఇటీవల మాజీ ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్ కుమార్ 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిని తన సతీమణి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించడం గమనార్హం. ఒక్క ఎకరా బ‌హిరంగ మార్కెట్ విలువ రూ.3 కోట్లకు పైగా ఉన్న ఆ ప్రాంతంలో ఏకంగా 25 ఎకరాలు ఎలా కొన్నారంటూ అధికార వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ధరణి పోర్టల్ వచ్చాక కొనుగోలు జరిగిందా లేక అంతకంటే ముందే చేశారా ఎలా కొన్నారు అనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పట్టాదారు డాగ్యన్ముద్ర (భర్త పేరు సోమేశ్ కుమార్) పేరిట ఖాతా నం. 5237 ద్వారా సర్వే నం. 249/ఆ1 లో 8 ఎకరాలు, 249/ఆ2 లో 10 ఎకరాలు, 260/అ/1/1 లో 7.19 ఎకరాల వంతున మొత్తం 25.19 ఎకరాలు ఉన్నట్లు తేలింది. ధరణి పోర్టల్ లో ఈ భూమికి సంబంధించిన ఖాతా నం. 5237 గా ఉంది. నిజానికి భూ రికార్డుల ప్రక్షాళనకు ముందు ఆ స్థాయిలో భూ ఖాతాదారులు లేరు. మరి ఈ ఖాతా నంబరు ఏ విధంగా కేటాయించారన్నది ఎవరికి అంతుచిక్కడం లేదు. ఈ భూమి సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేయలేదని తెలుస్తున్నది. సాదాబైనామా ద్వారా కొనుగోలు చేశారని అంటున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్ సైట్ లో ఎన్ కంబరెన్స్ సర్టిఫికేట్ ను పరిశీలిస్తే కొనుగోలు చేసిన ఆధారాలు కనిపించడం లేదు.

- Advertisement -

వాస్తవానికి ఐఎఎస్ గా పనిచేసిన వారు ఎలాంటి భూములు కొనుగోలు చేసినా.. ముందస్తుగా కేంద్రంలోని డీవోపీటీల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, సోమేశ్ కుమార్ మాత్రం తన భార్య పేరు మీద ల్యాండ్ కొన్నప్పటికీ.. డీవోపీటీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడం గమనార్హం. ఈయ‌న గారు గ‌త ప్ర‌భుత్వంలో ప్ర‌భుత్వ ముఖ్య కార్య‌ద‌ర్శిగా విధుల‌ను నిర్వ‌ర్తించారు. అలాంట‌ప్పుడు అన్ని శాఖ‌ల‌కు సంబంధించిన చ‌ట్టాల‌పై ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల‌పై పూర్తి అవ‌గాహ‌న ఉంటుంది. అలాంటి వ్య‌క్తి డీఓపిటి నుండి ఎలాంటి అనుమ‌తులు లేకుండా 25 ఎక‌రాల భూమిని కొనుగోలు చేశారంటే చ‌ట్టాన్ని ఏ విధంగా ఉల్ల‌ఘించారో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. పైన పేర్కొన్న 25 ఎక‌రాల భూమి కొనుగోలు వ్య‌వ‌హారం ఒక‌టి మాత్ర‌మే. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో అనేక స్ధిర‌, చ‌రాస్తులు కూడ‌బెట్టున‌ట్లు తెలుస్తుంది.

ఈ అంశంపై సోమేశ్ కుమార్ స్పందిస్తూ.. తాను ప్రభుత్వ నిబంధనలను అనుసరించే 2018 సంవత్సరం ప్రారంభంలోనే 25 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు కేటాయించిన నివాస స్థలంలో నిర్మించుకున్న గృహాన్ని విక్రయించి, ఆరేండ్ల కిందనే ఈ వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఈ భూమి కొనుగోలు కు సంబంధించి ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నానని స్పష్టం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు