Saturday, July 27, 2024

జిల్లాలో ఓటింగ్‌ శాతం పెంచాలి

తప్పక చదవండి

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌

శామీర్‌పేట : జిల్లా వ్యాప్తంగా ఓటింగ్‌ శాతం పెరిగేలా అవసం మైన చర్యలు తీసుకోవాలని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమా వేశ మంది రంలో జిల్లా అదనపు కలెక్టర్‌ నరసిం హారెడ్డి, డి.ఆర్‌.ఓ. చంద్రావతి (ఖీAజ)తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతి నిధులతో ఓటర్‌ జాబిత రూపకల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ అక్టోబర్‌ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని తెలిపారు. ఓటరు జాబితా పరిశీలనలో భాగంగా చేపట్టిన ఇంటింటి విచారణ ప్రక్రియ పూర్తి చేసినట్లు చెప్పారు. ఎలాంటి తప్పులు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితాని రూపొందించాలని, 18 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరు తమ ఓటు వివరాలు నమోదు చేసుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజాప్రతినిధులు తమ వంతుగా స్వీయ బాధ్యతతో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించడానికి కృషి చేయాలని కోరారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలనే లక్ష్యంతో పాటు, ఓటు హక్కు వినియోగంలో అవకతవకలు అరికట్టడంపై ఎన్నికల కమీషన్‌ దృష్టి సారించిందని వివరించారు. ఫారం 6-బి ద్వారా ఓటర్లు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవడంతో పాటు అర్హులైన నూతన యువత ఓటరుగా నమోదు చేసుకోవడానికి, ఓటర్ల జాబితాలో చనిపోయిన, పెళ్ళై వెళ్ళిపోయిన, డూప్లికేట్‌ కార్డు ఓటర్ల తొలగింపులో ప్రజాప్రథినిధులు సహకరించాలని కోరారు. పోలింగ్‌ కేంద్రానికి దూరంగా ఉన్న ఓటర్లను సమీప పోలింగ్‌ కేంద్రానికి మార్చుకునే విధంగా అవకాశం కల్పించాలని తెలిపారు. బూత్‌ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల పూర్తిస్థాయి బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు ఇంటి కి వెళుతున్న సందర్భంగా చనిపోయిన, రెండు ఎపిక్‌ కార్డులు కలిగిన వారి వివరాలను గుర్తించి భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నూతనంగా నమోదైన ఓటర్లకు గుర్తింపు కార్డుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాజకీయ పార్టీల బూత్‌ స్థాయి ఏజెంట్ల సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకొని ఓటరు జాబితాలో పేర్లు తప్పులు ఉన్న వాటిని సవరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఇబ్బందుల ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో డి.సి.ఓ. శ్రీనివాస్‌ మూర్తి, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు