Thursday, October 10, 2024
spot_img

ఎన్నికలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి

తప్పక చదవండి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ యస్‌. వెంకట్రావ్‌

సూర్యాపేట : ఎన్నికల నిబంధనలపై రెవెన్యూ, పోలీస్‌ అధికారులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ యస్‌. వెంకట్రావ్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల సమాయత్తం పై జిల్లాలోని రెవెన్యూ, పోలీస్‌ అధికారులతో ఎన్నికల విధివిధానాలపై యస్‌.పి. రాజేంద్రప్రసాద్‌ లతో కలసి పాల్గొని సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమస్యాత్మకం, దుర్బలతత్వం గల పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు పై రెవెన్యూ, పోలీస్‌ అధికారుకు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల హేతుబద్దీకరణలో భాగంగా పోలింగ్‌ కేంద్రాల పేర్లు మార్పు, కొత్త కేంద్రాల ప్రతి పాదనలు సిద్ధం చేసి అందించాలని ఆదేశించారు. ఎన్నికల సమయత్తంలో భాగంగా చేపట్టవలసిన విధివిధానాలపై ఎన్నికల కమిషన్‌ నిబంధనలు రెవెన్యూ, పోలీస్‌ అధికారులు తప్పక పాటించాలని అన్నారు. జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల తరలింపు ప్రతిపాదనలు కూడా రెవెన్యూ డివిజనల్‌ అధికారులు, నియోజక వర్గ తహశీల్దార్లు సత్వరమే పంపించాలని సూచించారు. జిల్లాలో కొత్త పోలింగ్‌ కేంద్రాల మరో 16 ఏర్పాటు చేయనున్నట్లు తుంగతుర్తి లో 8, సూర్యాపేట లో 1, కోదాడ 2, హుజూర్‌ నగర్‌ 5 కేంద్రాలు ప్రతి పాదనలు అందించాలని, అలాగే పోలింగ్‌ కేంద్రాల మార్పులలో భాగంగా హుజూర్‌ నగర్‌ 5, కోదాడ 8, సూర్యాపేట 6, తుంగతుర్తి 19 కేంద్రాలు మొత్తం 38 కేంద్రాల మార్పుకు రెవెన్యూ, పోలీస్‌ అధికారులు పరిశీలన చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వచ్చే ఎన్నికల నిర్వహణలో రెవెన్యూ, పోలీస్‌అధికారులు, సిబ్బంది అన్ని వేళలో అందుబాటులో సమన్వయంతో కలసి పనిచేయాలని ఈ సందర్బంగా ఆదేశించారు.ఈ సమావేశంలో అదనవు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత కేశవ్‌, యస్‌. మోహన్‌ రావు లతోఆర్‌.డి.ఓ లు సూర్యాపేట రాజేంద్ర కుమార్‌, కోదాడ కిషోర్‌ కుమార్‌,డి.యస్‌.పి లు నాగభూషణం,వెంకటేశ్వర రెడ్డి,రవి,సోమనారాయణ సింగ్‌, తులా శ్రీనివాస్‌, తహశీల్దార్లు, పోలీస్‌ అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు