Thursday, September 12, 2024
spot_img

ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

తప్పక చదవండి
  • ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడిరచిన బీజేపీ నాయకులు
    దేవరకొండ పట్టణం : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు దేవరకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సంద ర్భంగా పోలీసులకు భారతీయ జన తా పార్టీ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది టిఆర్‌ఎస్‌ ప్రభు త్వం అధికారంలోకి రావడం కోసం 2014లో 2018లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని న్యాయమైన డిమాండ్లతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లాలని ప్రయత్నించిన బిజెపి కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం రాష్ట్ర ప్రభుత్వ పిరికిపందచర్యగా బిజెపి నాయకులు అవి వర్ణించారు కెసిఆర్‌ అధికారంలోకి రావడానికి 57 సంవత్సరాలు నిండినటువంటి వారికి పెన్షన్‌ ఇస్తాను ఇల్లు లేనటువంటి నిరుపేదలందరు కూడా డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు ఇస్తాను నిరుద్యోగ భృతి ఇస్తాను అంటూ ఎన్నో వాగ్దానాలు చేసి వాటన్నిటిని కూడా తుంగలో తొక్కినందు కు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిరచడం జరిగిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి సురేష్‌,జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమోని రాములు,జిల్లా ఉపాధ్యక్షులు అంకురి నరసింహ,అసెంబ్లీ కన్వీనర్‌ ఏటి కృష్ణ,బిజెపి రాష్ట్ర నాయకులు కళ్యాణ్‌ నాయక్‌,వినోద్‌ రాథోడ్‌,వివిధ మండలాల అధ్యక్షులు గుండాల అంజయ్య,పప్పు సైదులు,బొడిగె సాంబశివ గౌడ్‌,బహదూర్‌ సింగ్‌,శివర్ల రమేష్‌ దేవరకొండ బిజెపి ఫ్లోర్‌ లీడర్‌ గాజుల మురళి,సోమిడి రాజు వివిధ మోర్చాల నాయకులు శక్తి కేంద్రం ఇంచార్జీలు బూత్‌ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు