Saturday, May 4, 2024

బీసీల సమస్యే ఈదేశ సమస్య..

తప్పక చదవండి

76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న స్వతంత్ర భారతావనిలో, ఈ నా దేశం బీసీలకు ఇచ్చింది ఏంటి? బీసీల పేరు చెప్పుకొని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న అన్ని పార్టీలు, బీసీల పేరు చెప్పుకొని లబ్ధి పొందుతున్న అన్ని పార్టీలు! బీసీ బిడ్డల ప్రయోజనం కోసం అభివృద్ధి కోసం, వాళ్ళ జీవితాల కోసం చేస్తున్నది ఏమిటి? బీసీ బిడ్డల ఆర్థిక స్వావలంబన కోసం, ఆర్థిక పరిపుష్టత కోసం, ఇప్పటిదాకా ఏర్పడ్డ ప్రభుత్వాలు గానీ, మాట్లాడిన పార్టీలు గానీ ఏమి చేసిన దాఖలాలు లేవు.. అన్ని పార్టీలను అధికారంలోకి తెచ్చిన ఘనత బీసీలదే. కానీ బీసీలను వాడుకొని వదిలేసిన ఘనత కూడా ఆయా పార్టీలదే. సంవత్సరాల తరబడి పార్టీల జెండాలు మోసిన కార్యకర్తల, నాయకుల జీవితాలు చిన్నా,భిన్నమయ్యాయి. ఇంకా అవుతున్నాయి. బీసీలలో ఇంకా రాజకీయ చైతన్యం రావాల్సిన అవసరం ఉంది, తెచ్చుకోవలసిన అవసరం కూడా ఉంది. అవసరమైతే బీసీలు ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కోసం ఐక్యంగా, వివేకంతో, సత్వరంగా నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. వెంటనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటించాల్సిన అవసరం ఉంది. రాజకీయంలో ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఉండదు కూడా. నిజంగా లేదు కూడా. ఎవరి ప్రయోజనాలు వాళ్లవి, ఎవరినీ అని లాభం లేదు కూడా, . ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఎప్పటికయినా తప్పదు! బీసీలు ఆర్థికంగా లేకపోవడం వల్ల రాజకీయాల్లో రాణించలేకపోతున్నారన్న వాస్తవాలను గ్రహించి, బీసీలకు వెనుక రాజ్యాంగం ఇచ్చిన కులం బలం కూడా లేదని గ్రహించి,ఐకమత్యం గా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. మీ (పార్టీ ల) అన్ని ప్రయోజనాలలో నా వాటా ఎంత ? అని ఎలుగెత్తి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. పనిలో మనం వాటా తీసుకున్నప్పుడు, ఫలితంలో వాటా వాటా కూడా అడగాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇవ్వని చోట ప్రశ్నించాల్సిన అవసరం అంతకుమించి ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా, బీసీలు ముందు నుంచే అన్ని రాజకీయ పార్టీలను, ఎలుగెత్తి, నిలదీసి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఐక్యంగా, సత్వరమే స్పందించాల్సిన అవసరం ప్రతి ఒక్క బీసీ బిడ్డకు ఉంది. మొదటినుంచి బీసీలు ఆర్థికంగా ఎదగకుండా, కావాలని అనగదొక్కుతున్నారు.. ఒక్క శాతం కూడా లేని వాళ్ళు ఆర్థిక బలంతో ఈ దేశాన్ని ఏలుతూ ఉంటే, అంబేద్కర్ పుణ్యమాని ఎస్సీ ఎస్టీలు రాజ్యాంగ రిజర్వేషన్లు పొందుతూ ఉంటే, 60 శాతం ఉన్న బీసీలు ఇంతవరకు కులగణన లేక చట్టసభల్లో ఎలాంటి ప్రాతినిధ్యం లేక చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు లేక, పార్లమెంటులో 88 మంది తెలంగాణలో 23 మంది మాత్రమే ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తుంటే, రాజ్యాంగాన్ని అమలుపరచాల్సిన నాయకులు కేవలం తమ కుల వర్గ ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తుంటే.. కొందరు పార్టీల అధ్యక్షులు, కేవలం తమ ఒక్క కులం ఓట్ల తోటే అధికారంలోకి రాలేమని తెలిసికూడా, ఏకంగా తమ కులం వారే అధికారంలోకి రావాలని బహిరంగంగా ప్రకటనలు మద్దతు ఇస్తుంటే బీసీలు తగుదునమ్మా అని వాళ్లకు మద్దతిస్తున్నారు.. తమ ప్రయోజనాలను కాపాడని పార్టీ లలో ఆయా పార్టీల బీసీల నాయకులు కార్యకర్తలు చైతన్యంతో ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. పోరాటం చేయాల్సిన అవసరం ఇంకా ఎంతైనా ఉంది. అవసరమైతే తమ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని అనిపిస్తే వెంటనే బీసీ ల ఆత్మ గౌరవం కాపాడుకోవడానికి సత్వర నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది..

  • చోళ్ళేటి మహేష్ బాబు.. 7032251681..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు