Saturday, December 2, 2023

పోలీసులు గులాబీ కండువా వేసుకున్నారు..

తప్పక చదవండి
  • బీజేపీ కార్యకర్తలపై ఇంత అమానుషమా..?
  • పోలీసుల తీరుపై ఫైర్ అయిన డీకే అరుణ..

హైదరాబాద్‌ : తెలంగాణ పోలీసులు గులాబీ కండువా వేసుకున్నట్లుగా వ్యవరిస్తున్నారని బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. శుక్రవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆమె విూడియాతో మాట్లాడుతూ..‘ బీజేపీ కార్యకర్తల్లారా.. ఇబ్బందులు పెట్టే పోలీసుల పేర్లు నమోదు చేసుకోండి.బీజేపీ అధికారంలోకి వచ్చాక వాళ్ల సంగతి చూద్దాం. పోలీస్‌ వ్యవస్థ అధికార పార్టీ కనుసన్నల్లో నడుస్తుంది. అరెస్ట్‌ చేయాల్సిన అవసరం లేకున్నా అరెస్ట్‌లు చేస్తున్నారు. బీజేపీ కార్యాకర్తలను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారు. కామారెడ్డి జిల్లా మాజీ జిఖ చైర్మన్‌ బీజేపీ నేత వెంకట్‌ రమణ రెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేశారు. ఎక్కడకు తీసుకెళ్లారో ఇంతవరకు తెలియదు. కేసీఆర్‌ గజ్వేల్‌లో బాగా అభివృద్ధి చేశారు… కామారెడ్డిలో పోటీ చేసి అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. కవిత ప్రకటనపై గజ్వేల్‌లో అభివృద్ధి చూద్దామని కామారెడ్డి జిల్లా మాజీ జిఖ చైర్మన్‌ వెంకట్‌ రమణరెడ్డి గజ్వేల్‌కు బయల్దేరారు. కానీ పోలీసులు అడ్డుకొని ఇష్టం వచ్చినట్లుగా వ్యవరించారు అని డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు