Friday, July 19, 2024

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి..

తప్పక చదవండి
  • దానం నాగేందర్ కు పొమ్మనలేక బి ఆర్ ఎస్ పార్టీ పొగపెడుతుందా ..?
  • దానం స్వంత గూటీకి వస్తానంటే కాంగ్రేస్ స్వాగతిస్తుందా. .?
  • ఇప్పటికే పోయినళ్ళను రమ్మనేది లేదని తేల్చి చెప్పిన
    టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దానం రాకను సమర్థిస్తారా .?
  • మాజీ నేతకు స్వంత నియోజకవర్గంలోనే పోరుమొదలయ్యిందా .?
  • ఆయనకు వ్యతిరేకంగా ఓ వర్గం ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టిందా.. ?
  • మాజీనేత రాజకీయ భవిష్యత్తుపై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక కథనం

( తన మనుగడకోసం రంగులు మార్చే ఊసరవెళ్లి సైతం రాజకీయ రంగులు పదే పదే మారుస్తున్న ఈ నాయకుడిని చూసి సిగ్గుపడుతోంది.. నిథాయం వివాదాల్లో వార్తల్లో ఉంటూ.. ఏపార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచనచేరి పబ్బం గడుపునే దానం నాగేందర్ లాంటి వారికి ఈసారి టికెట్ ఇస్తే సీటు గల్లంతు అవుతుందని, దానం నాగేందర్ వ్యతిరేక వర్గం వారు జోరుగా ప్రచారం చేస్తున్నారు.. )

హైదరాబాద్ : మాజీ మంత్రి, మాజీ కాంగ్రెస్ నేత, ప్రస్తుతం అధికార బి ఆర్ ఎస్ పార్టీ శాసన సభ్యులు దానం నాగేందర్ ముచ్చటగా మూడోసారి పార్టీ మారుతాడంటూ నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారాన్ని దానం అభిమానులు ఖండించినప్పటికీ.. పార్టీ మార్పు ప్రచారానికి మాత్రం ఎక్కడా బ్రేకులు పడటం లేదని తెలుస్తోంది. దానం నాగేందర్‌కు హైదరాబాద్‌లో మంచి పట్టు ఉంది. యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న యువ నేతగా ఆయన గుర్తింపును ఎవరూ కాదనలేరు.. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. గతంలో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు అనేకసార్లు ఇప్పటిలాగానే వార్తలు వెలువడ్డాయి. ఆ నేపథ్యంలో ఆయన ఇప్పటిలాగానే పార్టీ మారడాన్నిగతంలో కూడ తీవ్రంగా ఖండించారు కూడా. ప్రస్తుతం అలాంటి వార్తలే ఇప్పుడు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దానం నిజంగా పార్టీని వీడుతాడా.. లేక అదే పార్టీలో కొనసాగుతాడా..? ఒకవేళ పార్టీని వీడితే మళ్ళీ కాంగ్రేస్ కు వెళతారా..? లేక పాత పద్ధతిలాగా టీడీపీలో చేరి గెలిచి మళ్ళీ కాంగ్రేస్ లోకి చేరి మంత్రి అవుతారా.. అని లెక్కలేనన్ని జవాబు లేని ప్రశ్నలు నియోజకవర్గంలో వినబడుతున్నాయి. ఈ లెక్కల్లోని నిజాలు తెలియాలంటే ఎన్నికల వేళ వరకు వేచి చూడాల్సిందే.

- Advertisement -

గతంలో టికెట్ ఇవ్వలేదని టీడీపీలో చేరి గెలిచిన దానం :
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తాను ఆశించిన టికెట్ ఇవ్వలేదన్న కోపంతో దానం టీడీపీ టికెట్ తీసుకుని పోటీచేసి గెలుపొందారు. తరువాత జరిగిన అనుహ్య పరిణామాల నేపథ్యంలో టీడీపీ ఓటమి పాలవడం కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవడంతో ఆయన మళ్ళీ కాంగ్రేసులోకి చేరి మంత్రి పదవి కూడా చేపట్టారు. . అయితే ఇటీవల దానంఫై వస్తున్న కథనాల నేపథ్యంలో మళ్ళీ ఆనాటి పరిస్థితులే వస్తాయని ఆయనతో సన్నిహితంగా మెలిగిన పలువురు నాయకులు చెబుతున్నారు. ఈ సారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్న సంకేతాలు బలంగా వినబడుతున్న నేపథ్యంలో దానం మళ్ళీ కాంగ్రేస్ వైపు చూస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే కాంగ్రేస్ మాత్రం దానం రాకను స్వాగతించడంలేదని తెలుస్తోంది. ఆయననే కాదు గతంలో పార్టీని విడిచి పెట్టిన ఏ ఒక్కరినీ తిరిగి పార్టీలోకి తీసుకునేదిలేదని ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

బీ.ఆర్.ఎస్. లో ఇమడలేకపోతున్న దానం :
తెలంగాణ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగిన దానం నాగేందర్ అధికార పార్టీలో చేరిన తరువాత మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. తనతో పాటు, తనకంటే ముందు వివిధ పార్టీల నుంచి తెరాసలో చేరిన నాయకులతో సమానంగా తనకు పార్టీలో గుర్తింపు లేకపోవడంతో ఆయన నొచ్చుకున్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని పలుమార్లు తన సన్నిహితుల దగ్గర వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన అధికార పార్టీలో ఇముడలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది.. దీనికి తోడు స్వంత పార్టీలోనే ఆయనకు ఓ బలమైన వ్యతిరేక వర్గం తయారయ్యింది. ఈ వ్యతిరేక వర్గానికి అధిష్టానం అండదండలు పుష్కలంగా ఉన్నాయని దాంతోనే వాళ్ళు నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు సైతం చేపడుతున్నారని తెలుస్తోంది. అంతే కాకుండా తమకే టికెట్ వస్తుందంటూ దానం వ్యతిరేక వర్గం ప్రచారం మొదలుపెట్టడంతో దానం ఉండలేక తనకే టికెట్ అని తానే స్పష్టం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

దానంని చుట్టుముడుతున్న వివాదాలు :
ఎమ్మెల్యే దానం నాగేందర్ కు ఆవేశం ఎక్కువ.. ఈ విషయాన్ని తన సన్నిహితులే తరుచూ చెబుతుంటారు. నిత్యం ఎదో ఒక వివాదాల్లో చిక్కుకుంటున్న దానం వ్యవహారంఫై కెసిఆర్ అంతగా సంతృప్తిగా లేరన్నది దానం వ్యతిరేకవర్గం ప్రధానంగా చెబుతున్న అంశం. నియోజవర్గంలో అభివృద్ధిని దానం సమర్థవతంగా చేపట్టలేకపోయారని.. ప్రభుత్వం పథకాలను లబ్దిదారులకు చేర్చడంలో దానం పూర్తిగా వైఫల్యం చెందారని.. దానం వ్యతిరేక వర్గం ప్రచారం మొదలుపెట్టింది. నియోజకవర్గంలో పలు భూఆక్రమణలు చేశారని దానంపై ఇప్పటికే పలు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనఫై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని ఆయనకు టికెట్ ఇస్తే ఖఛ్చితంగా ఓడిపోవడం ఖాయమని, దానం వ్యతిరేక వర్గం అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళింది. దీంతో దానం సీటుకు నీలి మబ్బులు కమ్ముకున్నాయి . దానం ఒక పక్క తన సీటు కన్ఫామ్ అని బయటకి చెప్పుకుంటున్నా లలోపల మాత్రం దిగులుపడుతున్నారని తెలుస్తోంది. ఈ దిగులుని అధికార పార్టీ నేతలు గుర్తించి పోగొడతారా..?లేదా అన్నది వేచి చూడాలి..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు