Thursday, May 2, 2024

అవినీతికి పరాకాష్టగా సరూర్ నగర్ టౌన్ ప్లానింగ్ విభాగం.. !

తప్పక చదవండి
  • టి.ఎస్.బీ.పాస్. చట్టానికి యథేచ్ఛగా తూట్లు..
  • మౌనం వహిస్తున్న ఉన్నతాధికారులు..
  • సరూర్ నగర్ టౌన్ ప్లానింగ్ విభాగంపై ఏసీబీ దాడులు
    జరుగపోవడం అధికారులకు కలిసొచ్చే అంశం..
  • అక్రమ నిర్మాణాలకు కొమ్ముకాస్తున్న ఏసీపీ దేవేందర్,
    సెక్షన్ ఆఫీసర్ కిష్టయ్య లపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలి..

సరూర్ టౌన్ ప్లానింగ్ విభాగం అవినీతికి పరాకాష్టగా మారిందా? మీ జీతం మీకు సరిపోతుందా అన్న సినిమా డైలాగ్ తరహాలో వ్యవహరిస్తున్న తీరు…? అక్రమ నిర్మాణాలను ఆదాయ వనరులుగా మార్చుకుంటున్న వైనం? కనిపించని ఎస్.టి.ఎఫ్ పనితీరు ? ప్రభుత్వం పొందుపరచిన టి.ఎస్.బి.పాస్ చట్టానికి అడ్డుకట్ట వేసి తూట్లు పొడుస్తూన్న వైనం? ఈ అవినీతి తదంగంపై ఉన్నతాధికారులు స్పందించరా? వారిది కూడా ద్వంద వైఖరేనా..? మౌనం వీడని ఉన్నతాధికారులు? టౌన్ ప్లానింగ్ విభాగంపై ఏ.సి.బి దాడులు జరగకపోవడం వల్లనే అవినీతి పరాకాష్టకు చేరింది…అక్రమ నిర్మాణాలపై కొమ్ము కాస్తున్న ఏ.సి.పి. దేవేందర్, సెక్షన్ ఆఫీసర్ కిష్టయ్య పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్?

ఎల్బీనగర్, అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.. ప్రభుత్వం, చట్టం, నియమ, నిబంధనలు మాకు ఏమాత్రం వర్తించవు అంటూ కొందరు అక్రమ నిర్మాణదారులు తమ ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు.. అక్రమ నిర్మాణాలకు తావు లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన చట్టం టి. ఎస్. బి.పాస్.. ఎల్బీనగర్ జోన్ పరిధిలోని..సరూర్ నగర్ సర్కిల్ లో.. కానరాకుండా పోతోంది..

- Advertisement -

టి.ఎస్.బి.పాస్ చట్టానికి అడ్డుకట్ట వేసి తూట్లు పొడుస్తున్న వైనం మనకు కనిపిస్తూనే ఉంది.. అక్రమ నిర్మాణాలనే ఆదాయ వనరులుగా మార్చుకొని ప్రభుత్వ ఆదాయాన్ని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులే.. పరోక్షంగా కొల్లగొడుతున్న వైనం తేటతెల్లమవుతోంది.. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి… ఈ అవినీతి అధికారుల తదంగంపై జోనల్ కమిషనర్ కు ఆధారాలతో సహా లిఖితపూర్వకంగా ఎమ్మార్పీఎస్.. ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది… సరూర్ నగర్ టౌన్ ప్లానింగ్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై మీడియాలో ఎన్నో వరుస కథనాలు వచ్చినా ఇప్పటి వరకు ఉన్నతాధికారులు ఏమాత్రం స్పందన లేకుండా ఉన్నారు.. అందుకు అర్థం ఏమిటని సామాజిక కార్యకర్తలు ఉన్నతాధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నారు… వారిది ద్వంద వైఖరిలగానే ఉందని వాపోతున్నారు.. అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన ఎస్.టి.ఎఫ్.. టీం పూర్తిగా నిద్రావస్థలో ఉందని సామాజిక కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నారు. ఓ నిర్మాణదారుడు.. కొత్తపేట్ డివిజన్, మారుతీ నగర్ లో టి.ఎస్.బి..పాస్ నుండి రెండు అంతస్తుల భవనానికి అనుమతులు తీసుకొని, కమర్షియల్ భవనంగా మార్చి అదనంగా ఒక అంతస్తు నిర్మిస్తున్నారు… మరో నిర్మాణదారుడు కొత్తపేట్ డివిజన్ పరిధిలోని.. ప్రధాన రహదారిలో రెండు అంతస్తుల భవనానికి అనుమతులు తీసుకొని ప్రభుత్వ నిబంధనలు ఏదేచ్చగా ఉల్లంఘించి.. సెల్లార్, నాలుగు అంతస్తుల కమర్షియల్ భవనాన్ని నిర్మిస్తున్నాడు… మరో నిర్మాణదారుడు గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని కమలా నగర్ లో డొమెస్టిక్ అనుమతులు తీసుకొని.. కమర్షియల్ భవనంగా మారుస్తున్నారు.. ఇప్పుడు ఈ భవనం నిర్మాణదశలో ఉంది.. మరో నిర్మాణదారుడు… కమలా నగర్ లో రెండు అంతస్తులకు అనుమతులు తీసుకొని ఐదు అంతస్తులు నిర్మిస్తున్నాడు… ఇలాంటి అక్రమ నిర్మాణాలకు టౌన్ ప్లానింగ్ ఏ.సి.పి. దేవేందర్, సెక్షన్ ఆఫీసర్ కిష్టయ్య లు అక్రమ నిర్మాణాలను సక్రమ నిర్మాణాలుగా మారుస్తూ.. వారికి కొండంత అండగా భరోసానిస్తూ.. ఓ సినిమా డైలాగు తలపించేలా నీ జీతం మీకు సరిపోతుందా అంటూ ? ఆ డైలాగుకు పరోక్షంగా ప్రాణం పోస్తున్నారు.. ప్రజలు కట్టిన పన్నులతో జీతం తీసుకుంటూ.. వక్రమార్గంలో సంపాదనకు అలవాటు పడి.. పరోక్షంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని సామాజిక కార్యకర్తలు వాపోతున్నారు.. మరి ఈ కథనంపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి ?…

కొన్ని అక్రమనిర్మాణాల వివరాలు :
1) ఫైల్ నెంబర్ 257155/జి.హెచ్.ఎం.సి/2087/2023 .. పర్మిట్ నెంబర్ 257155/1178/జి.హెచ్.ఎం.సి 2023..
2) ఫైల్ నెంబర్ 184084/జిహెచ్ఎంసి/12772/2022.. పర్మిట్ నెంబర్ 184084/7743/జిహెచ్ఎంసి/2022..
3) ఫైల్ నెంబర్ 187082/జిహెచ్ఎంసి/13368/2022.. పర్మిట్ నెంబర్ 187082/7907/జిహెచ్ఎంసి/2022..
4) ఫైల్ నెంబర్ 233481/జిహెచ్ఎంసి/23196/2022.. పర్మిట్ నెంబర్ 233481/12868/ జిహెచ్ఎంసి/2022..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు