Friday, May 3, 2024

చంద్రుడిపై విక్రమ్‌ ల్యాండర్‌ పనితీరు అద్భుతం..

తప్పక చదవండి
  • ల్యాండర్‌ సేఫ్‌ ల్యాండింగ్ కు మరోమారు పరీక్ష..
  • పరిశీలించిన ఇస్రో శాస్త్రవేత్తలు..

బెంగళూరు :
చంద్రుడిపై తిరుగుతున్న ల్యాండర్‌కు ఆదేశాలు ఇవ్వడంతో మరోమారు సేఫ్‌ ల్యాండిరగ్‌ ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు పరిశీలించారు. తాజాగా విక్రమ్‌ ల్యాండర్‌పై ఒక చిన్న ప్రయోగం చేశారు. హాప్‌ ప్రయోగంలో భాగంగా ల్యాండర్‌కు ఆదేశాలు ఇవ్వగా.. అది దాని ఇంజిన్లను మండించింది.. సుమారు 40 సెంటివిూటర్ల వరకు గాల్లోకి లేచి, కొద్ది దూరంలో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. ఈ ఎక్స్‌పరిమెంట్‌ విజయవంతమైన నేపథ్యంలో.. విక్రమ్‌ జాబిల్లిపై మరోసారి సాప్ట్‌ ల్యాండింగ్ అయ్యిందని ట్విటర్‌ మాధ్యమంగా ఇస్రో వెల్లడించింది.. తన మిషన్‌లో భాగంగా విక్రమ్‌ ల్యాండర్‌ నిర్దేశించిన లక్ష్యాలను మించి అద్భుత పనితీరుని ప్రదర్శించింది. ఇది ఇప్పుడు హాప్‌ ఎక్స్‌పరిమెంట్‌ని విజయవంతంగా పూర్తి చేసింది. మేము ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా విక్రమ్‌ ల్యాండర్‌ తన ఇంజిన్లను మండించి 40 సెంటివిూటర్ల వరకు గాల్లోకి లేచి, 30 నుంచి 40 సెంటివిూటర్ల దూరంలో సేఫ్‌గా ల్యాండ్‌ అయ్యిందని అంటూ ఇస్రో సంస్థ ట్వీట్‌ చేసింది. ఈ ప్రయోగం తర్వాత అన్ని వ్యవస్థలు సక్రమంగా పని చేస్తున్నాయని తెలిపింది. ర్యాంప్‌, ఛాస్ట్‌, ఇల్సా పేలోడ్స్‌ని తిరిగి అమర్చబడ్డాయని వెల్లడించింది.. ఈ ప్రయోగం హ్యూమన్‌ మిషన్స్‌కి పనికొస్తుందని ఇస్రో చెప్పుకొచ్చింది. ఈ ట్వీట్‌కి ల్యాండర్‌ సాప్ట్‌ ల్యాండింగ్ వీడియోని కూడా జత చేసింది. ఇదే సమయంలో మరో ట్వీట్‌లో ఇస్రో కీలక అప్డేట్‌ ఇచ్చింది. విక్రమ్‌ ల్యాండర్‌ నేడు 08:00 గంటలకు స్లీప్‌ మోడ్‌లోకి వెళ్లనుందని.. అంతకుముందు ఛాస్ట్‌, రంభఎల్‌పీ, ఇల్సా పేలోడ్స్‌ కొత్త ప్రాంతంలో ప్రయోగాలు నిర్వహిస్తాయని.. సేకరించిన డేటాను భూమికి చేరవేస్తాయని తెలిపారు. ప్రస్తుతానికి పేలోడ్స్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయబడ్డాయని, ల్యాండర్‌ రిసీవర్స్‌ మాత్రం ఆన్‌లోనే ఉంచడం జరిగిందని ఇస్రో పేర్కొంది. సోలార్‌ పవర్‌ తగ్గి, బ్యాటరీ అయిపోయాక.. ప్రజ్ఞాన్‌ రోవర్‌ పక్కనే ల్యాండర్‌ నిద్రలోకి జారుకుంటుందన్నారు. సెప్టెంబర్‌ 22వ తేదీన ఈ రెండూ తిరిగి మేల్కొంటాయని ఆశిస్తున్నామని ఇస్రో ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ట్వీట్‌కి హోప్‌ ఎక్స్‌పరిమెంట్‌కి ముందు, ఆ తర్వాత ల్యాండర్‌ ఇమేజర్‌1 కెమెరా తీసిన ఫోటోలను జోడించింది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు