Saturday, May 18, 2024

తెలంగాణాలో జోరు వర్షాలు..

తప్పక చదవండి
  • జంటనగరాల్లో రెండ్రోజులుగా వానలు..
  • హైదరాబాద్‌లో అప్రమత్తం అయిన జీ.హెచ్.ఎం.సి.
  • ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారుల హెచ్చరిక..

హైదరాబాద్‌ :
అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదాబాద్‌ వాతావరణశాఖ తెలిపింది. నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల్‌ జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. నేడు, రేపు నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు అతిభారీ వర్ష సూచన ఉన్నదని వాతావరణ శాఖ వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. సోమవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వీటికితోడు ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తుండటంతో ప్రాజెక్టుల్లో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, నిజాంపేట, ప్రగతినగర్‌, మియాపూర్‌, చందానగర్‌, లింగంపల్లి, కొండాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, కుత్బుల్లాపూర్‌, బహదూర్‌పల్లి, సూరారం, సుచిత్ర, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, బాలానగర్‌ ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తున్నది. హైదరాబాద్‌ నగరానికి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. హైదరాబాద్‌ మహా నగరంలో ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. అలాగే సోమవారం ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. అర్ధరాత్రి తర్వాత చినుకులతో మొదలై.. ఉదయం 6 గంటల నుంచి గంటన్నర పాటు దంచి కొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. అవిూర్‌పేట, మైత్రీవనం, మయూర్‌ మార్గ్‌తో పాటు పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై భారీగా వరద నిలిచిపోవడంతో ఉదయం బయటకు వచ్చిన వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు భవనాల్లో సెల్లార్లలోకి, నార్సింగ్‌ మున్సిపాలిటీ బాలాజీనగర్‌ కాలనీలో పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పందెంవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తెల్లవారుజామున కురిసిన వర్షంతో వాతావరణం మారడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం సెలవురోజు కావడంతో ఉదయం వేళ ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తలేదు. ఆరు నుంచి 7.30 వరకు కురిసిన భారీ వర్షంతో రహదారులు చెరువులను తలపించాయి. బోరబండలో అత్యధికంగా 8.8 సెం.విూ వర్షపాతం నమోదైంది. రోడ్లపై నిలిచిన నీటిని బయటకు పంపించేందుకు జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది చర్యలు చేపట్టారు. సీజన్‌ ప్రారంభమైన తర్వాత జూన్‌లో రెండు సార్లు, జూలైలో నాలుగు సార్లు మాత్రమే గ్రేటర్‌లో భారీ వర్షాలు నమోదయ్యాయి. రెండు వారాలుగా రెండు, మూడు సార్లు తేలికపాటి జల్లులు మినహా.. ఎక్కడా భారీ వర్షాలు లేవు. దీంతో నగరంలో పొడి వాతావరణం ఏర్పడి వేడి పెరిగింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముంటుందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే నగర వాసులకు బల్దియా టోల్‌ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసింది. నగరవాసుల సమస్యల పరిష్కారం కోసం టోల్‌ ఫ్రీ నంబర్లు 040` 21111111, 9000113667ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డిజాస్టర్‌ బృందాలు అప్రమత్తంగా ఉండాలంటూ అడిషనల్‌ కమిషనర్‌ ప్రకాష్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూమ్‌కు పలు అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు కూలాయి. అల్వాల్‌, రాంనగర్‌, సైనిక్‌పురి, మధురానగర్‌, అత్తాపూర్‌, బీఆర్‌కే భవన్‌, టోలిచౌకి, ఖైరతాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి చెట్లు కూలాయని 16, జూబ్లీహిల్స్‌, చికోటి గార్డెన్, ఆర్‌పీ రోడ్‌, పురానాపూల్‌, మాదాపూర్‌, షేక్‌పేట తదితర 16 ఏరియాల నుంచి వరద నీరు నిలిచాయన్న ఫిర్యాదులు వచ్చాయి. ఖైరతాబాద్‌లో పాత గోడ కూలగా.. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు. 35 ఫిర్యాదులు రాగా.. 34 పరిష్కరించినట్టు ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాష్‌ రెడ్డి తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఎడతెరపి లేకుండా వర్షం వస్తున్నది. ఇందల్వాయి, డిచ్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ, జక్రాన్‌పల్లిలో వాన దంచికొడు తున్నది. అత్యధికంగా డిచ్‌పల్లి మండలం గన్నారంలో 14 సెంటీవిూటర్ల వర్షం పడిరది. గాంధారి, సిరికొండ మండలంలోని చీమనుపల్లిలో 12 సెం.విూ, సదాశివనగర్‌ జుక్కల్‌, జక్రాన్‌పల్లిలో 11 సెం.విూ, డిచ్‌పల్లి, మదన్‌పల్లిలో 10 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదయింది. శ్రీరాంసాగర్‌కు మరోమారు వరద పోటెత్తింది. ఇక భూపాలపల్లి జిల్లాలో ఆదివారం నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ 2, 3 గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కాగా, నిజామాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలలకు జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్‌ నేడు సెలవు ప్రకటించారు. భారీ వానలతో పలుచోట్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నది. సంగారెడ్డి జిల్లా కంగ్టిలో అత్యధికంగా 13 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదయింది. మెదక్‌ జిల్లా కౌడిపల్లిలో 8.3 సెంటీవిూటర్ల వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో వచ్చే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదాబాద్‌ వాతావరణశాఖ తెలిపింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు