Friday, May 17, 2024

నిప్పులు చెరుగుతూ నింగిలోకి..

తప్పక చదవండి
  • ఆదిత్య ఎల్-1 రాకెట్ ప్రయోగం సక్సెస్..
  • సూర్యుడి రహస్యాల ఛేదనకోసం 125 రోజుల జర్నీ..
  • 15 లక్షల కి.మీ. దూరంలోని లాంగ్రాజ్ పాయింట్ ని చేరుకోనున్న ఆదిత్య..
  • ఆదిత్య లైఫ్ టైం దాదాపు 5 ఏళ్లకు పైగానే..
  • భారత టెక్నాలజీ రంగంలో మరో మైలు రాయి. విజయవంతంగా నిర్ణీత కక్షలోకి చేరిన ఆదిత్య ఎల్ – 1..
  • ఇక ఆదిత్యుడి సౌరయానం మొదలైంది : సోమనాథ్‌
  • చంద్రాయన్‌ – 3 కూడా అద్భుతంగా పనిచేస్తుందని వెల్లడి..

శ్రీహరికోట : ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్‌1 స్పేస్‌క్రాప్ట్‌ నిర్దేశిత కక్ష్యలోకి చేరుకున్నది. విజయవంతంగా పీఎస్‌ఎల్వీ సీ57 నుంచి ఆదిత్య వేరుపడిరది. దీంతో మిషన్‌ సక్సెస్‌ అయినట్లు ఇస్రో ప్రకటించింది. 15 లక్షల కిలోవిూటర్ల దూరంలో ఉన్న ఎల్‌1 పాయింట్‌ దిశగా ఆదిత్య స్పేస్‌క్రాప్ట్‌ తన జర్నీ మొదలుపెట్టినట్లు ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌ తెలిపారు. సుమారు 1.04 నిమిషాల తర్వాత రాకెట్‌ నుంచి వేరుపడిన ఆదిత్య ఎల్‌1 కక్ష్యలోకి చేరింది. ఉదయం 11.50 నిమిషాలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. నిర్దేశిత కక్ష్యలోకి ఆదిత్య ప్రవేశించినట్లు ఇస్రో తన సోషల్‌ విూడియా అకౌంట్‌ ఎక్స్‌లో పేర్కొన్నది. ఎల్‌1 పాయింట్‌ దిశగా ఆదిత్యుడి సౌరయానం మొదలైనట్లు వెల్లడిరచింది.. కాగా చంద్రయాన్‌ – 3కి చెందిన పెద్ద అప్‌డేట్‌ ఇచ్చారు ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌. విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి రోవర్‌ ప్రజ్ఞాన్‌ సుమారు వంద విూటర్ల దూరం వెళ్లినట్లు ఆయన చెప్పారు. ఆదిత్య ఎల్‌1 మిషన్‌ సక్సెస్‌ అయిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడిరచారు. చంద్రయాన్‌`3కి చెందిన అన్ని పరికరాలు సవ్యంగా పనిచేస్తున్నట్లు సోమనాథ్‌ చెప్పారు. ల్యాండర్‌, రోవర్‌లు ఇంకా ఫంక్షన్‌ చేస్తున్నాయన్నారు. రోవర్‌ పంపిన డేటాను ఇస్రో శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. మరో ఒకటి రెండు రోజుల్లో రోవర్‌, ల్యాండర్లను స్లీపింగ్‌ మోడ్‌లోకి తీసుకువెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు