Sunday, April 28, 2024

బోనాలు తెలంగాణ సాంస్కృతిక ప్రతిక..

తప్పక చదవండి
  • రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు
  • బోనాలు బలహీనవర్గాల ఇష్టమైన పండుగ : జాతీయ బీసీ దల్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

సకల జనులు సుఖశాంతులతో ఉండాలని కోరుకునే ప్రజల ఇష్టమైన పండుగ బోనాలు అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. బోనాలు తెలంగాణ ప్రజల సాంస్కృతిక, సాంప్రదాయ వైభవానికి ప్రతీక అని ఆయన తెలిపారు. గడిచిన 10 ఏళ్లుగా సెంట్రల్ ఓబీసీ కమిటీ ఈసారి కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం జాతీయ అధ్యక్షురాలు ఎం భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నగరం నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు పాల్గొని బోనాలు సమర్పించి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఓబీసీ సెంట్రల్ కమిటీ ఆహ్వానం మేరకు కార్యక్రమంలో డాక్టర్ వకుళాభరణం పాల్గొని బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడి పండుగలు ఇక్కడి సాంప్రదాయాలు ఇక్కడి వంటకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందుతుండడం ఆనందంగా ఉందన్నారు .ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవవలనే సాధ్యమవుతున్నదని ఆయన అన్నారు. బోనాలు పండుగ క్షేమాన్ని కోరే గొప్ప శ్రేయోధాయకమైన పండుగ అని ఆయన అభివర్ణించారు. ప్రకృతిలో ఏర్పడే ఋతువులలో జరిగే మార్పుల కారణంగా ప్రజలకు ఎలాంటి అంటువ్యాధులు గాని రోగాలు గాని ఇతర బాధలు గాని రాకుండా చల్లగా చూడాలని కోరుకునే ఒక మహోన్నతమైన పండుగనే తెలంగాణ బోనాల పండుగ అని ఆయన అన్నారు. సెంట్రల్ ఓబీసీ కమిటీ అధ్యక్షురాలు ఏం భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గత గడిచిన గడిచిన పదేళ్లుగా క్రమం తప్పకుండా అమ్మవారికి బోనాలను సమర్పించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నామని ఆమె తెలిపారు ఈ బోనాలలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న ఎంతో మందికి మేలు జరిగిందని ఉన్నతమైన అవకాశాలు వచ్చాయని ఆమె తెలిపారు. జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ప్రసంగిస్తూ అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని కోరుకుంటూ అమ్మవార్లను ప్రార్థిస్తూ బలహీన వర్గాలకు సంబంధించిన చెందిన అక్కచెల్లెళ్లు నిర్వహించే గొప్ప పండుగని బోనాలు అని అన్నారు. ఏళ్ల తరబడిగా ఈ సాంప్రదాయాన్ని పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన సోదరీమణులు కొనసాగిస్తున్నారని ఈ ఘనత ఆ వర్గాలకు చెందిన సోదరీమణులకే చెందుతుందని ఆయన అన్నారు. నగరంలో ఆషాడ మాసంలో బోనాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తున్నదని ఈ పండుగను రెండు మూడు నెలల పాటు నగరమంతా అన్ని వీధులలో నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇది బోనాల సందర్భంగా డాక్టర్ వకుళాభరణం, దుండ్ర కుమారస్వామి ,భాగ్యలక్ష్మి వివిధ ప్రాంతాల నుండి భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయ ప్రాంగణానికి చేరుకున్న మహిళలు బోనమెత్తి అమ్మవారి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు బోనాలు సమర్పిస్తున్న సందర్భంగా చార్మినార్ ప్రాంతంలో కోలాహలం కనిపించింది. తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయ ఆధ్యాత్మిక వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ కార్యక్రమము అత్యంత వైభవంగా కొనసాగింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు