Sunday, April 28, 2024

సర్వేయర్ వెంకటేష్ ను సస్పెండ్ చేయాలి

తప్పక చదవండి
  • అక్రమాలను సక్రమం చేసే ఘనుడు
  • అవినీతి సర్వేయర్ వి అన్ని అక్రమాలే
  • గతంలో ఉప్పల్ మండలంలో భూ యజమానులకు చుక్కలు చూపిస్తున్న సర్వేయర్
  • అమ్యామ్యాలతో పుచ్చుకొని తప్పుడు సర్వే రిపోర్ట్ లను సక్రమం చేసిన ఘనత
  • సర్వేయర్ పై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోని అధికారులు

అక్రమాలను కూడా సక్రమాలుగా మార్చే ఘనుడు.. ఆమ్యామ్యాలు ఇస్తే ఎలాంటి గడ్డినైనా ఖర్చే వ్యక్తి గతంలో పని చేసిన ఉప్పల్ మండల సర్వేయర్ ఎం వెంకటేష్ అంటూ ఆయన బాధితులు షమీర్ బేగ్ ఆరోపిస్తున్నారు. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. లంచం ఇస్తే తప్పుడు రిపోర్ట్ లను కూడా మార్చి సరియైన రిపోర్టులుగా చేసి ఇస్తాడని
బాధితులు చాలామంది అంటున్నారు. తహసిల్దార్ మొదలుకొని జిల్లా కలెక్టర్ వరకు ఈయన అంటే వణుకు.. అతని అవినీతి లీలలపై ఎన్నోసార్లు కంప్లైంట్ లు చేసిన ఎవరు పట్టించుకోరు. ఏడి సర్వేయర్ సర్వే ఆఫ్ ల్యాండ్ కమిషనర్ నుండి వచ్చిన రిపోర్టర్లను కూడా తారుమారు చేయడంలో ఇతనుదిట్ట. వారివే తప్పుడు రిపోర్టులు అంటు తనదే సరైనదని సర్వేయర్ వెంకటేష్ సమర్ధించుకుంటాడు.
ఉప్పల్ మండలం ఉప్పల్ గ్రామంలోని 581/1 సర్వే నెంబర్ కు ఏడి సర్వే రిపోర్ట్ ఇస్తే దానికి బదులు 584 సర్వే నెంబర్ అని ఇతను సర్వే రిపోర్ట్ ఇచ్చాడు. అక్రమ బిల్డర్ తో చేతులు కలిపి సర్వే నెంబర్లను కూడా మార్చి సర్వే రిపోర్టులను మార్చేసిన ఘనుడు. ఇతనిచ్చిన సర్వే రిపోర్ట్ ఆధారంగా చేసుకొని జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ లో అక్రమంగా బిల్డర్ అనుమతులు పొంది ఏకంగా బిల్డింగ్ కట్టేశారు.
షమీర్ బేగ్ అనే బాధితుడు పుట్టింగు దశల్లో ఉన్నప్పటి నుంచి మొత్తుకొని గగ్గోలు పెట్టిన నిర్మాణం పూర్తయినంతవరకు కూడా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపిస్తున్నారు. ఇతనిపై గతంలో పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసిన ఇతని ఏమి చేయని అధికారులు సర్వేయర్ వెంకటేష్ తో లోపాయకారి ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా అని అనుమానాలు కలగక మానవు. ఇప్పటికే ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి అవినీతి సర్వేయర్ ను ఉద్యోగంలో నుండి తొలగించాలని, లేదంటే ఇతని వల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్ కు చెడ్డ పేరు వస్తుందని అన్నారు. అంతేకాకుండా గతంలో పనిచేసిన మండలాలలో ఎన్నో అక్రమాలు జరిగాయి అనే కోణంలో ఇతనిపై విచారణ చేపట్టి అధికారులు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బాధితుడు కోరుతున్నారు. ఈ అవినీతి సర్వేయర్ వెంకటేష్ లీలలను ఒకటిగా వెలికి తీసి ప్రజల ముందు పెట్టనుంది ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు