Monday, May 6, 2024

విద్యార్థులకు కోపం తెప్పించిన మొండి ప్రవర్తన

తప్పక చదవండి

పరీక్షా కేంద్రాల్లోకి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించకూడదని ఒకవైపు ప్రభుత్వం కఠినంగా రూల్స్ అమలు చేస్తుండగా, మరోవైపు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి సమయముండగానే చేరుకున్నా ఐదు నిమిషాల పాటు ఇరుకు రోడ్డు నుండి నడవడంలో సమయం వృథా అవుతోంది. పరీక్ష కేంద్రం చుట్టూ ఉన్న ఇరుకైన రోడ్ల గుండా వెళ్లాల్సివస్తుంది. ఇలాంటి సమస్యలు విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు చేరుకోనుటకు పరుగులు తీస్తున్నారు. శుక్రవారం హిమాయత్ నగర్ న్యూ సెయింట్ జోసెఫ్ కళాశాలలోని పరీక్షా కేంద్రంలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. ఈ కాలేజికి ఆనుకొని ఉన్న అపార్ట్‌మెంట్‌లోని కారు యజమాని కళాశాల మార్గమధ్యలో తన కారును రోడ్డుకు అడ్డంగా పెట్టేసాడు. పరీక్షా కేంద్రానికి వస్తున్న విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. తన కారును రోడ్డుకు అడ్డంగా పెట్టి ట్రాఫిక్‌ను నిలిపివేసి విద్యార్థులను పరీక్షా కేంద్రం వద్ద వదిలేందుకు వచ్చిన తల్లిదండ్రులతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడు. మొండిగా వ్యవహరిస్తూ, కారు కదలకుండా ట్రాఫిక్ ని అడ్డుకున్నాడు. కారు యజమానిని తల్లిదండ్రులు ప్రశ్నించగా, ప్రభుత్వ రోడ్డు తనదేనని, ఈ లైన్‌లోకి ప్రైవేట్‌ వాహనాలను అనుమతించబోమని, దురుసుగా సమాధానమివ్వడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నిలకొంది. విషయం తెలుసుకున్న దోమలగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించగా, పోలీసులతో కూడా దురుసుగా ప్రవర్తించసాగాడు. వెంటనే పోలీసులు అతడిని మందలించి కారును అపార్ట్‌మెంట్ లోపలికి తరలించేలా చేశారు. అక్కడ గుమిగూడిన తల్లిదండ్రులు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి నిందితుడిపై తక్షణమే చర్యలు తీసుకోవల్సిందిగా పోలీసులను అభ్యర్థించారు. సమయానికి పోలిసులు స్పందించి విచారణ చేసి కారు యజమాని పై కేసు నమోదు చేసారు మరియు కారును స్వాధీనం పరుచుకున్నారు. తదుపరి విచారణ చేసి కారు యజమనిపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు