Monday, September 9, 2024
spot_img

అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలి

తప్పక చదవండి
  • పంజాగుట్ట స్మశాన వాటిక, వెంకటేశ్వర కాలనీలో కమిషనర్ రోనాల్డ్ రోస్ ప‌ర్య‌ట‌న‌

పంజాగుట్ట స్మశాన వాటికలో అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కార్పొరేటర్ మన్నే కవితతో కలిసి కమిషనర్ పంజాగుట్ట స్మశాన వాటిక, వెంకటేశ్వర కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను కార్పొరేటర్ కమిషనర్ దృష్టికి తీకువ‌చ్చారు. స్మశాన వాటికలో కొత్తగా అభివృద్ధికి కోసం చేపట్టిన అసంపూర్తి పనులకు అనుమతి ఇస్తూ వెంట‌నే పనులను చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను అదేశించారు. అంతేకాకుండా ఆఫీస్ గది మిగిలిన పనులకు కూడా కమిషనర్ మంజూరు చేస్తూ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సింగిడి కుంట నాలా అభివృద్దికి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా నాలా బాక్స్ డ్రైన్ పునర్నిర్మాణానికి బీట్ వైజ్ మంజూరు చేశారు. అంతేకాకుండా క్యాచ్ పిట్స్, రోడ్డు మరమ్మత్తులు, వెంటనే టెండర్ పూర్తి చేసి వచ్చే వర్ష కాలం నాటికి నాలా బాక్స్ డ్రైన్ పనులు ప్రజలకు ఇబ్బంది లేకుండా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లో గల డిస్ప్యూట్ స్థలంలో మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణానికి అదేవిధంగా తట్టిఖాన రిజర్వాయర్ సైట్ వద్ద కూడా మల్టీ లెవెల్ పార్కు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులను అదేశించారు. అంతకు ముందు కమిషనర్ జె.వి.ఆర్ పార్క్ లో చేపట్టి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. టాయిలెట్ మరమ్మత్తులు, గ్రీనరి అభివృద్ధి, ఎలక్ట్రికల్ ఇంప్రూవ్ మెంట్, ఎస్.టి.పి సీవరేజ్ ట్రీట్మెంట్ పొంట్ పరిశీలించి కెపాసిటీ పెంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఎంటమాలజి అధికారులను ఆదేశించారు. కమిషనర్‌తో పాటు జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రే, ఎస్.ఈ రత్నాకర్, యు.బి.డి అదనపు కమిషనర్ డాక్టర్ సునంద తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు