Monday, April 29, 2024

రిటైర్డ్ ఉద్యోగులకు పెన్నిధిగా ” స్త్రీ నిధి సహకార సమాఖ్య “

తప్పక చదవండి

  • ప్రైవేటు వ్యక్తి చేతుల్లో రూ. 5400 కోట్ల స్త్రీ నిధి భవిష్యత్…!
  • స్త్రీ నిధి సమాఖ్యలో పెత్తనం చెలాయిస్తున్న ఓ పెత్తందారు..
  • సహకార చట్టం 1964 సర్వీస్ రూల్స్ నిబంధనలకు తూట్లు..
  • ఎలాంటి అర్హత లేకుండా విధుల్లో కొనసాగుతున్న విద్యాసాగర్ రెడ్డి..
  • రిటైర్డ్ ఉద్యోగస్తులకు అడ్డాగా మారిన స్రీ నిధి..
  • 5400 కోట్ల టర్నోవర్ వున్న సంస్థలో ఒక్క ప్రభుత్వ అధికారి కూడా లేకపోవడం శోచనీయం..
  • తెర వెనుక ఓ మంత్రి ఓ.ఎస్.డీ. చక్రం తిప్పుతున్నట్లు సమాచారం..!

మహిళాభ్యుదయం కోసం ఏర్పాటుచేసిన స్త్రీ నిధి సహకార సమాఖ్యలో జరుగుతున్న అక్రమాలకు కారణం ఎవరు..? ఎవరి కనుసన్నలలో సమాఖ్య పరిపాలన సాగుతోంది..? కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన సంస్థకు జవాబుదారీ ఎవరు అన్నది ప్రశ్నార్థకంగా మారింది..దశాబ్దకాలంగా ఒక రిటైర్డ్ వ్యక్తి చక్రం తిప్పుతుండటం వెనుక మతలబు ఏమిటి..?
తెలంగాణ స్త్రీ నిధి సహకార సమాఖ్యలో విద్యా సాగర్ రెడ్డి విధుల్లో కొనసాగుటకు ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయా..? విద్యా సాగర్ రెడ్డి లక్షల్లో వేతనం తీసుకుంటున్నారా..? అసలు సహకార చట్టం 1964 సర్వీస్ రూల్స్ ఏం చెపుతున్నాయి.. ఒక్క సంవత్సరంలో మేనేజింగ్ డైరెక్టర్ చేతుల్లో ఎంత మంది ఉద్యోగులు తోలగించబడ్డారు..ఎంత మంది రాజీనామా చేశారు.. స్త్రీ నిధిలో జరుగుతున్న అరాచకాలకు సంబంధించి వాస్తవాలను ఆధారాలతో….వరుస కథనాలతో వెలుగులోకి తేనుంది.. ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘ .. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు