Sunday, May 19, 2024

కీలకం కానున్న ఎస్.ఐ. రాజేందర్ ఫోన్ డేటా..

తప్పక చదవండి
  • ఆరా తీస్తున్న పోలీసులు..
  • ఈ నెల 26న రాజేందర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..
  • ఎస్సై డ్రగ్స్ షెడ్లర్ల వివరాలు రాబట్టే ప్రయత్నం..

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఎస్సై రాజేంద్ర అరెస్టైన సంగతి తెలిసిందే. పట్టుబడిన డ్రగ్స్‌లో కొంత దాచిన రాజేంద్ర 1750 గ్రాముల మెథకొలిన్‌ అమ్ముకునే యత్నం చేయగా తెలంగాణ న్యాబ్‌ పోలీసులు ఎస్సై రాజేంద్రను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో ఎస్సై రాజేంద్రతో సంబంధం ఉన్న ఇతర అధికారులు, డ్రగ్‌ పెడ్లర్లపై పోలీసు ఆరా తీస్తున్నారు. ఎస్సై రాజేంద్ర మణికొండ పరిధిలో పట్టుబడ్డాడు. అనంతరం నిందితుడిని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. దీనిపై రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితుడిని ఆగస్టు 26వ తేదీన అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు