Saturday, May 18, 2024

చేనేత ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటి పోచంపల్లి

తప్పక చదవండి

యాదాద్రి భువనగిరి : పోచంపల్లి చేనేత టైఅండ్‌డై ఇక్కత్‌ వస్త్రాల డిజైన్లు అద్భుతం అని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి ప్రశంసించారు. ఇంటినే రీసెర్చ్‌ సెంటర్‌గా మార్చుకుని తెలంగాణ చేనేత ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటి చెబుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లికి చెందిన ఆచార్య లక్ష్మణ్‌ బాపూజీ అవార్డ్‌ గ్రహీతలు బోగ బాలయ్యసరస్వతి ఇంటికి అనుకోని అతిథిలా వెళ్లిన మంత్రి, బాలయ్య కుటుంబ సభ్యులను ఆశ్చర్య పరిచారు. భువనవగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డితో కలిసి 10 వేల రంగులు వచ్చేలా తయారు చేసిన చీరను పరిశీలించారు. బోగ బాలయ్య రూపొందించిన 10వేల రంగుల భారత దేశం పటంతో కూడిన డబుల్‌ ఇక్కత్‌ వస్త్రాన్ని డిజైన్లను చూసి ప్రశంసించారు. చేనేత రంగానికి ప్రపంచ నలువైపులా పేరు తేవడానికి ఇంటినే ప్రయోగశాలగా మార్చుకుని పోచంపల్లి టై అండ్‌ డై ఇక్కత్‌ హ్యాండ్లూమ్‌ డిజైన్‌, రీసెర్చ్‌ డెవలప్‌ మెంట్‌ అండ్‌ ప్రోడక్షన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న బాలయ్య సరస్వతి దంపతులకు ప్రోత్సాహం అందించేందుకు సత్వరమే వారికి అన్ని వసతులతో కూడిన షేడ్‌ ను మంజూరు చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు