Thursday, May 2, 2024

సేవాదళ్ సేవలు చిరస్మరణీయం

తప్పక చదవండి
  • సేవాదళ్ తోని కాంగ్రెస్ అధికారంలోకి
  • కాంగ్రెస్ పార్టీని ఆపదలో ఆదుకునే నేస్తం
  • బిజెపికి ఆర్ఎస్ఎస్ ఎలాగో కాంగ్రెస్ కు సేవాదళ్ అలాగే
  • హస్తం గుర్తు చేతి వేళ్లలో బొటనవేలే సేవాదళ్
  • సేవాదళ్ అంటే ఒక సమూహం కాదు ఒక ఆయుధం
  • దేశ ప్రజల శ్రేయస్సుకోసం 1923లో స్థాపన
  • సేవాదళ్ స్థాపనలో ఎందరో మహనీయులు
  • అఖిలభారత కాంగ్రెస్ సేవాదళ్ గా రూపాంతరం
  • కేంద్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడమే మా దేయం
  • సేవాదళ్ జాతీయ అధ్యక్షుడు లాల్ జి దేశాయ్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్, ప్రధాన కార్యదర్శి నిరంజన్

ఆనాడు తెల్ల దొరల పాలనలో భారతదేశం మగ్గిపోతున్న సమయంలో భారతీయులపై జరుగుతున్న హింసాత్మక దాడుల్లో భారతదేశ పౌరుల్ని, యువతను, ప్రజలను, పీడించి రకరకాలుగా అరెస్టులు చేయడం చంపడం లాంటి దాడులు జరుపుతున్న సమయంలో మనను మనం కాపాడుకోవాలన్న ఆత్మ రక్షణలో భాగంగా ఏర్పాటయింది సేవాదళ్. దీనిని 1923 లో నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ కూతురైన శ్రీమతి సరోజినీ నాయుడు స్థాపించారు. ఒక మహాసభలో భారతదేశంపై జరుగుతున్న హింసాత్మక దాడులను ఇలా ఎదుర్కోవాలని ఆలోచనల మధ్య పుట్టిన ఆయుధమే ఈ సేవాదలని ఆపదలో ఉన్న ప్రతిసారి కాంగ్రెస్ పార్టీకి సేవాదళ్ పని చేస్తుంది. సేవాదళ్ ఆనాడు మొదటగా 13 మంది సభ్యులతో ఏర్పాటయింది ఇందులో పండిత్ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాంటి ఎందరో స్వాతంత్ర సమరయోధులు ముందుండి ఈ సేవాదల్ని నడిపారు ఆనాడు బ్రిటిష్ పాలన ను అంతముందించి స్వతంత్రాన్ని తీసుకురావడంలో సేవాదళ్ పాత్ర కీలకమని చెప్పొచ్చు. స్వాతంత్రం కంటే ముందు దీనిని హిందుస్థాన్ సేవాదల్గా పిలిచేవారని దీనికి స్వయంగా మహాత్మా గాంధీ అధ్యక్షత వహించారని చరిత్ర చెబుతోంది. స్వాతంత్రం రావడానికి సేవాదళ్ ఎంతో స్పష్టంగా పనిచేసిందని ఆనాడు 1931 హిందుస్థాన్ సేవాదల్గా ఏర్పడ్డాక స్వయాన మహాత్మా గాంధీ అధ్యక్షత వహించారు. ఆయన నేతృత్వంలోని పనిచేస్తూ స్వాతంత్రాన్ని సాధించుకున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందుస్థాన్ సేవాదళ్ కాస్త అఖిలభారత కాంగ్రెస్ సేవాదలుగా రూపాంతరం చెందింది. దీనికి డాక్టర్ నారాయణ సుబ్బారావు హార్దిక అధ్యక్షతన నడిపారు.

Sevadal services are memorable

బిజెపి పార్టీ అధికారంలోకి రావడానికి ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ అఖిల భారత విద్యార్థి పరిషత్( ఏబీవీపీ) లాంటి ఇంకా ఎన్నో అనుబంధ సంస్థలు పని పనిచేస్తాయో అలాగే కాంగ్రెస్ పార్టీ నీ అధికారంలోకి తేవడానికి అఖిలభారత సేవాదళ్ తోపాటు యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ, ఇలా ఎన్నో సంస్థలు కాంగ్రెస్ గెలుపుకు పనిచేస్తాయి. అందులో ముఖ్య పాత్ర పోషించేది అఖిలభారత సేవాదళ్ మాత్రమే, ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడింది కూడా సేవాదలే ఇప్పుడు ఉత్తర భారత దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే సేవా సేవాదళ్ సైన్యం రంగంలోకి దిగాల్సిన అవశ్యకత ఏర్పడింది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ఈ అఖిలభారత సేవాదళ్ పనిచేస్తుందని గతంలో పలు రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని దిగ్విజయంగా గెలిపించి ఆ పార్టీకి అధికారం కట్టబెట్టి ముఖ్యమంత్రిగా చేసిన ఘనత కూడా అఖిలభారత సేవాదలకే దక్కుతుందని ఇప్పుడు కూడా దేశంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తేవడానికి నిరంతరం శ్రమిస్తుందని అలుపెరుగక పార్టీ గెలుపు కోసం పనిచేస్తుందన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది ముఖ్యమంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లను అందించిన ఘనత కూడా అఖిలభారత సేవాదళ్తేనని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ ప్రతి జిల్లా, తాలూకా, మండల గ్రామ స్థాయిల్లో పశిష్టంగా ఉందని ప్రతి గ్రామంలోనూ సేవాదళ్ కార్యకర్తలు ఉన్నారని, కాంగ్రెస్ పార్టీకి బలము బలగం రెండు కూడా సేవాదలేనని సేవ దళ్లో కరుడుగట్టిన కాంగ్రెస్ సైన్యం ఉందని ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు లాల్ జి దేశాయ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్, ప్రధాన కార్యదర్శి నిరంజన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుని ఎవరు ఆపలేరని సేవాదళ్ పక్షాన వ్యక్తం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు