Sunday, October 13, 2024
spot_img

కార్పొరేషన్, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో యాదవులకు అవకాశం కల్పించాలి

తప్పక చదవండి
  • మునుగోడు నియోజకవర్గం యాదవ్ సంఘం అధ్యక్షుడు బట్టు జగన్ యాదవ్

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో నియమించే కార్పొరేషన్, మార్కెట్ కమిటీ చైర్మన్, స్థానిక సంస్థలలో యాదవులకు అవకాశం కల్పించాలని మునుగోడు నియోజకవర్గం యాదవ్ సంఘం అధ్యక్షుడు బట్టు జగన్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటుచేసిన యాదవ్ సంఘం సమావేశంలో బట్టు జగన్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎం అనిల్ కుమార్ యాదవ్ ని పెద్దల సభకు నామినేట్ చేయడని వారు హర్షం వ్యక్తం చేశారు, తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ గెలుపున కు యాదవ్ లు శక్తి వంచన లేకుండా కృషి చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర జనాభాలో 18 శాతం ఉన్న యాదవ్ లు అణిచివేతకు గురవుతున్నారు అని గత పాలకుల నిర్లక్ష్యం తో ఆర్థిక, సామాజిక రాజకీయ రంగాల్లో యాదవులు వెనుకబడిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ యాదవుల సంక్షేమాన్ని పక్కనపెట్టి గొర్రెల స్కీము చేపట్టి వారిని చదువులకు దూరం చేసి గ్రామాలలో గొర్రెల కాపరిగా పరిమితం చేసిందని వారి సంక్షేమాన్ని పక్కన పెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం యాదవులు చేసిన కృషి మరువలేదని అన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు 2 వ విడత గొర్రెల పంపిణీ చేపడుతామని ప్రలోభాలకు గురిచేసిన, వారిని విశ్వసించని యాదవులు కాంగ్రెస్ పార్టీ వైపు నిలిచారని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో యాదవులకు రెండు లక్షల నగదు బదిలీ చేపడతామన్న హామీని అమలు చేయాలని కోరారు.

రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ ఎక్కడ చేపట్టకుండా మునుగోడులో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కృషివలనే రెండో విడత గొర్రెల పంపిణీ సాధ్యమైందని వారు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పై యాదవులకు ఎంతో విశ్వాసం ఉందని యాదవులను అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని యాదవుల ఆకాంక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు మేకల యాదన్న యాదవ్ మునుగోడు యాదవ సంఘం అధ్యక్షుడు సాగర్ల లింగస్వామి యాదవ్, చండూరు అధ్యక్షుడు ఆవుల అశోక్ యాదవ్, ఉపాధ్యక్షుడు చెప్పరి రాజు యాదవ్, గట్టుపల్ అధ్యక్షుడు పంకెర్ల ఐలయ్య యాదవ్, వంగూరి యాదయ్య యాదవ్, రావుల రమేష్ యాదవ్, నాంపల్లి అధ్యక్షుడు పంగ రామ్మోహన్ యాదవ్, నాంపల్లి కాంగ్రెస్ పార్టీ ఓ బి సి అధ్యక్షుడు బట్టు శ్రీను యాదవ్, గిరి యాదవ్, రేవల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు