Monday, April 29, 2024

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట వేల కోట్ల కుంభకోణం…?

తప్పక చదవండి
  • ఔట్ సోర్సింగ్ లో అంతులేని అవినీతి
  • ప్రతీ ప్రభుత్వ విభాగంలోనూ భారీ జీతాల కోత..?
  • అదనంగా పీఎఫ్ ఈఎస్ఐ కుంభకోణం..?
  • లోతుగా వెళ్తే ఇంకెన్ని బయటపడతాయో…?…
  • కమిషన్ల కోసమే ఔట్ సోర్సింగ్ ను ప్రోత్సహించిన గత ప్రభుత్వం
  • ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో కోట్లు కొల్లగొట్టిన బిఆర్ఎస్ నాయకులు

తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ సంపదను దోచుకుంటూ తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు తెలంగాణ సెంటిమెంట్ ని వాడుకొని గత పాలకులు విచ్చలవిడిగాదోచుకున్నారు. రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ రంగంలోనూ అవినీతి కుంభకోణాలు జరుగైనడానికి ఇదొక ఉదాహరణ గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇదో తరహా కుంభకోణం.. కొంతమంది బిఆర్ఎస్ నాయకులు ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులను నిండా ముంచి, లక్షల రూపాయలకు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను కొంతమంది సాదారణ అమాయక వ్యక్తులకు అమ్ముకున్నారు. అంటే జాయినింగ్ లోనే కోట్లు కొల్లగొట్టారు..ఇంకా మరింత లోతుగా వెళ్తే అసలు జీతాలు అటుంచి కొసరు జీతాలు ఇచ్చి మరిన్ని కోట్లు దోచేశారు.అవీ బినామీ వ్యక్తుల చేత నడప బడే సంస్థల/ ఏజెన్సీల చేత…ఒక జిల్లాలో ఒక వైద్య ఆరోగ్య శాఖ లో సుమారు 1000 మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారు.ఒక్కొక్కరి దగ్గర 3500 నుండి 7 వేలు ,8 వేల వరకు కోతలు పెడుతూ ప్రతీ సంవత్సరం ఒక్క శాఖ నుండే ఒక్క ఏరియా నుండే 50 నుండి 60 కోట్లు కొల్లగొడుతున్నారు.ఇది ఒక్క ఏరియా,జిల్లా శాఖ అని అనుకోలేం అన్నీ జిల్లాల్లో ఇదే తంతు అంటే ఇలా రాష్ట్రం మొత్తం ఉన్న వైద్య శాఖ అనుబంధ కళాశాలలు,హాస్పిటల్స్ లో కలిసి చూస్తే ఇది కొన్ని వేల కోట్ల కుంభకోణం..?…ఇంకా అదనంగా చాలా మంది ఉద్యోగులకు పిఎఫ్, ఈఎస్ఐ ఇతర సౌకర్యాలు ఇవ్వట్లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక వైద్య శాఖనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి డిపార్ట్మెంట్లో ఇదే తంతు నడిపించారని కొన్ని నిఘా వర్గాల తెలిసిన సమాచారం..అంటే ఇదో పెద్ద కుంభకోణం అని . దీనిపై రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్థాయి విచారణ జరిపి ఔట్సోర్సింగ్ లో జరిగిన అవినీతిపై నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ ప్రజలు అంటున్నారు..అంటే ఏ రకంగా దోచుకున్నారు ,ఇంకా దోచుకుంటున్నారు అనేది పూర్తి విచారణ లో మాత్రమే బయటపడుతుంది…ఇక్కడ మరో పెద్ద కుంభకోణం ఏంటి అంటే ఏ ఒక్క ఉద్యోకికి అసలు అపాయింట్ మెంట్ ఆర్డర్ లు ఇవ్వకపోవడం ఒకటైతే అసలు అది లేకుండా ఎలా జాయిన్ చేసుకున్నారు.అనేది మరో వింత.!ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించుటకు నోటిఫికేషన్ లు జారీ చేయకుండ ,ఏజెన్సీ లకు ఎలా అప్పజెప్పారు..ఎన్ని సంవత్సరాలకి అప్పజెప్పారు..ఎన్ని ఏజెన్సీల నుండి దరఖాస్తులు తీసుకున్నారు ఈ ఏజెన్సీలు ఎవరికి కనసన్నల్లో నడుస్తున్నాయో అర్థం కాకుండా ఉంది..అవన్నీ రహస్యాలు..అంటే పెద్ద తలలు రకరకాల ఎత్తులు వేసి దోచుకోవడానికి పెద్ద ప్లాన్ లే వేశారని స్పష్టం చేస్తున్నాయి ఈ చేష్టలు..

గత ప్రభుత్వం ఔట్సోర్సింగ్ విధానాన్ని ప్రోత్సహించడం ముఖ్యంగా కమిషన్ల కోసమేనని కొందరు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇక్కడ కొస మెరుపు ఏంటి అంటే కొన్ని ఏజెన్సీల బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఇతర శాఖల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు..వారికి ఒక్కొక్కరికి నెలా నెలా 40 వేల నుండి 50 వేలకు పైగా జీతాలు అంటే నిండా ముంచి నవ్వుతూ మోసం చేయడమే. గత రాజకీయ తంత్రం.ప్రశ్నిస్తే ప్రశ్నించే వారినీ రకరకాలుగా అణగదొక్కాలని ,మీడియా ను మేనేజ్ చేస్తూ బయటపడకుండా దోచుకుని దాచుకున్నారు…ఇంకా త్వరలో మరిన్ని….

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు