Thursday, February 29, 2024

అవినీతి అధికారిపై కరుణ‌

తప్పక చదవండి
  • అప్ప‌టి ఆరోగ్య‌శాఖ క‌మిష‌న‌ర్ వాకాటి క‌రుణ నిరంజ‌న్‌ను నియ‌మించ‌డంలో పాత్ర ఏమిటి..?
  • అవినీతి అధికారిని అంద‌ల‌మెక్కించిన క‌మిష‌న‌ర్‌
  • క్వాల్టీ ఆషురేన్స్‌కు కన్నం వేసిన అధికారి కె. నిరంజ‌న్
  • ఉన్నతాధికారుల అండదండలతో పదవులు
  • కమిషనర్‌ హెల్త్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో అవకతవకలు
  • ఎన్‌హెచ్ఎం ఐఈసీ మెటీరియ‌ల్ లో రూ. 20కోట్ల40 ల‌క్ష‌ల కుంభ‌కోణం
  • కుంభ‌కోణంలోని అవినీతి సొమ్మును రిక‌వ‌రీ చేయాలి
  • ఎన్‌హెచ్ఎంలోని కుంభ‌కోణాల‌పై ప్ర‌భుత్వం దృష్టి సారించాలి..

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో రోజుకో వింత చోటు చేసుకుంటోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలోని నేషనల్ హెల్త్ మిషన్ లో క్వాల్టీ అషురేన్స్‌ విభాగంలో చోటు చేసుకుంటున్న వింతలు అంత ఇంత కావు. నీరు, నిధులు, నియమకాల్లో భాగంగా ఎంతో మంది పోరాట యోదుల ఫలితంగా ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పెత్తందారుల పోకడలు, ఆదేశాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. అన్ని ఉన్న అల్టుడి నోట్లో శనిలా మారింది. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా చేరి ఉన్నతాధికారుల అండదండలతో నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్‌లోని క్వాల్టీ అషురేన్స్ విభాగానికి ప్రోగ్రాం ఆఫీసర్‌గా ఎదిగాడు కె.నిరంజన్‌ కుమార్‌. రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనరే నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ గా ఉండడం జరుగుతుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న వసతులు, సౌకర్యాల కల్పన, రోగికి అందిస్తున్న మందుల నాణ్యత, ట్రీట్‌మెంట్‌ విధానం, చికిత్స పొందుతున్న ఓ రోగి నుండి మరో రోగికి వ్యాదులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, వివిధ అంశాలపై ఆరా తీయడం, అవసరమైన సూచనలీవ్వడం ఎన్ హెచ్ ఎం లోని క్వాల్టీ అషూరేన్స్‌ విభాగం ముఖ్య ఉద్ధేశ్యం.

ఈ విభాగం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో పనిచేస్తుంది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు, రోగులకు అందిస్తున్న చికిత్స తదితర అంశాలకు సంబంధించి పర్యవేక్షించేందుకు కేంద్రం నుండి ముగ్గురు సభ్యులు కలిగిన కమిటీ రాష్ట్రానికి సంబంధించిన అధికారులతో కలిసి తనిఖీ చేసి ఆసుపత్రుల అభివృద్ధికి స్పెషల్‌ ఫండ్స్‌ కింద నిధులను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఆసుపత్రిలోని బెడ్స్‌ ఆధారంగా ప్రతి బెడ్‌కు రూ. 10వేల చోప్పన మూడు సంవత్పరాల పాటు నిధులను మంజూరు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల పర్యవేక్షణ నేషనల్‌ హెల్త్‌ మిషన్ క్వాల్టీ అషురేన్స్ విభాగం అధికారుల స‌మ‌క్షంలో కొనసాగుతుంది. ఈ శాఖ అధికారుల పనితీరుపైనే ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి ఆధార‌ప‌డి ఉంటుంది.
నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ క్వాల్టీ అషురేన్స్ విభాగం రాష్ట్ర ప్రోగ్రాం ఆఫిసర్‌గా జ్యోస్నా 2015లో ఔట్‌సోర్సింగ్‌ కింద నియమితులయ్యారు. ఆమె 2015 నుంచి 2017 వరకు విధుల్లో కొనసాగారు. కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్ ఫామిలీ వెల్ఫేర్‌, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ డైరెక్టర్ గా ఐఎఎస్‌ అధికారి వాకాటి కరుణ కమిషనర్‌గా ఉన్నపుడు రాష్ట్రంలోని ఆసుపత్రుల నిర్వాహణను పర్యవేక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 30 జిల్లాలకు గాను జిల్లా నాణ్యత ప్రమాణాల అధికారులను నియమించేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా ఇంటర్వ్యూ ప్యానెల్‌ బోర్డులో ఉన్న నలుగురిలో ఒకరు అప్పటి కమిషనర్ వాకాటి కరుణ అనుచరుడు కె.నిరంజన్‌ కుమార్ (రిలియన్స్‌ స్వచ్చంద సంస్థ ప్రతినిధి).

- Advertisement -

ప్యానెల్‌ బోర్డులో మెంబర్‌గా ఉన్న నిరంజన్‌ ఎకంగా కమిషనర్‌ అండదండలతో స్టేట్ కాన్స‌ల్టేంట్‌ క్వాల్టీ అషూరేన్స్‌లో ఉద్యోగం సంపాదించాడు. ఔట్‌ సోర్సింగ్‌లో ఉద్యోగంలో చేరిన నిరంజన్‌ ఇదే విభాగంలో ప్రోగ్రాం ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న జోస్న స్థానంలో భర్తి అయ్యాడు. అక్కడి నుండి ఆట మొదలు పెట్టిన నిరంజన్‌ ఎవరైన ఉద్యోగులకు ఎదైన పని ఉంటే చెయ్యి తాడపాల్సిందే. అదిలాబాద్‌, తాండుర్‌ క్వాల్టీ మెనేజర్‌లుగా విధులు నిర్వహించిన రాధిక, ఆశోక్‌లను స్టేట్ కాన్స‌ల్టేంట్‌లుగా నియమించాడు. నిరంజన్‌ సుమారు రూ.1.50లక్షల జీతం తీసుకుంటూ, కారు తదితర సౌకర్యాలతో ఓ నియంతాల ఉద్యోగాన్ని కొన‌సాగించారు. ప్రోగ్రాం ఆఫిసర్‌గా నిరంజన్‌ 2018-19 సంవత్సరంలో ఆపోలో మెడిస్కిల్స్‌ టాస్క్‌ పేరుతో ఒప్పందం కుదుర్చుకుని లక్షల్లో కమిషన్‌లు అర్జించాడు. మెకానైజ్‌డ్‌ లాండ్రీ టెండర్లలో కూడా అవకతవకలకు పాల్పడిన నిరంజన్‌కు కమిషనర్ వాకాటి కరుణ అండదండలుండటం పట్ల పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2019లో వాకాటి కరుణ బ‌దిలీ అవడంతో డాక్టర్‌ యోగితరాణ కమిషనర్‌గా వచ్చిన తరువాత నిరంజన్‌ను విధులనుండి తొలగించింది. 2020లో తిరిగి వాకాటి కరుణ కమిషనర్‌గా రావడంతో నిరంజన్‌ను తిరిగి విదుల్లో తీసుకున్నారు. తనపై ఆరోపణలు చేసిన దాదాపు పది మంది ఉద్యోగులను విధుల నుండి తొలగించి కక్షాసాధింపు చర్యలకు పాల్పడ్డాడు. ఈ విషయంతో కమిషనర్ వాకాటి కరుణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నిరంజ‌న్‌కు ఎంతగా సహకరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

నిరంజన్ ఆరోగ్యశాఖలోని కమిషనర్ కార్యాల‌యంలో క‌మిష‌న‌ర్‌ను పలు సందర్భాలలో ఏకవచనంతో సంభోదించ‌డం గమనార్హం. నిరంజన్ పై వివిధ రకాల ఆరోప‌ణ‌లు ఉండడంతో 2022 సంవత్సరంలో శ్వేత మహంతి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత నిరంజన్‌ను తొలగించారు. గతంలో వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌గా పనిచేసిన వాకాటి కరుణ సిఫారాసు మేరకు ప్రస్తుతం కమిషనర్‌గా ఉన్న ఐఎఎస్‌ అధికారి ఆర్‌.వి.ఎస్‌ .కర్నన్‌ తిరిగి కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్ ఫామిలీ వెల్ఫేర్‌, డైరెక్టర్‌ నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ విభాగం లోని క్వాల్టీ ఆషురేన్స్ ప్రోగ్రాం ఆఫీసర్‌గా నిరంజన్‌ కుమార్‌ను నియమించడం ఏంటని ఆరోగ్యశాఖలో చర్చించుకుంటున్నారు. గతంలో కమిషనర్ గా ఉన్న వాకాటి కరుణ విధులు నిర్వ‌ర్తిస్తున్న సమయంలో నేషనల్ హెల్త్ మిషన్ ఐఈసి మెటీరియల్ కు సంబంధించిన సుమారు 20 కోట్ల 40 లక్షల కుంభకోణం జ‌రిగింద‌ని ద‌ర్యాప్తు సంస్థ బాజాప్త నివేదిక ఇచ్చిన‌ప్ప‌టికి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకుండా, అవినీతి అధికారుల‌కు సహకరించడం జరిగింది.

రక్షకుడే బక్షకుడిగా మారినట్లు ఆరోగ్యశాఖను రక్షించాల్సిన ఐఏఎస్ అధికారి వాకాటి కరుణ అవినీతి అధికారులకు అండ‌గా ఉండడం అత్యంత బాధాకరం. అవినితీ అధికారిగా పెరొందిన నిరంజన్‌కు అందాలమెక్కిచడం వెనుక ఆంతర్యం ఏమిటి? అతగాడు చేస్తున్న అవినీతి సొమ్ములో ఏమైనా భాగస్వామ్యం ఉన్నదా..? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా నూతనంగా ఏర్పడ్డ ప్రజా పాలనలో అవినీతికి తావు లేకుండా ప్రజా ఆరోగ్య శాఖ ను పటిష్టం చేయాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.

నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్‌లో కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు కేటాయించిన నిధులను దారి మ‌ళ్లీంచి, అవినీతికి పాల్ప‌డిన అధికారుల అవినీతి భాగోతంపై పూర్తి ఆధారాల‌తో మ‌రో క‌థ‌నం ద్వారా వెలుగులోకి తేనుంది ఆదాబ్ హైద‌రాబాద్.. మా అక్ష‌రం.. అవినీతిపై అస్త్రం…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు