Tuesday, July 16, 2024

యూఎస్‌ఏ బాక్సాఫీస్ వద్ద సామజవరగమన హవా..

తప్పక చదవండి

కంటెంట్‌ను నమ్ముకొని సినిమా చేసే హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు టాలీవుడ్‌ హీరో శ్రీవిష్ణు. ఈ టాలెంటెడ్‌ యాక్టర్ నటించిన తాజా చిత్రం సామజవరగమన. వివాహ భోజనంబు ఫేం రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో ఫన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ జూన్ 29న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ప్రీమియర్ షోల నుంచి ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన వస్తోంది. కాగా ఈ చిత్రం యూఎస్‌ఏ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ.. శ్రీవిష్ణు టీంలో ఫుల్ జోష్ నింపుతోంది. తాజాగా కలెక్షన్లకు సంబంధించిన అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం యూఎస్‌ఏ బాక్సాఫీస్ వద్ద 787వేల డాలర్లు (రూ.6.5 కోట్లు) వసూలు చేసిందని ట్రేడ్‌ సర్కిల్ సమాచారం. రెండో శనివారం సామజవరగమన ఊహించని విధంగా రూ.82,61,550 (ఒక లక్ష డాలర్లు) కలెక్షన్లు రాబట్టిందంటే సినిమాను ప్రేక్షకులను ఎంతలా ఇంప్రెస్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. తాజా కలెక్షన్ల అప్‌డేట్ నేపథ్యంలో ఈ చిత్రం యూఎస్‌ఏ బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్‌ మార్క్‌ చేరుకుంటుందా..? అనేది చూడాలంటున్నారు ట్రేడ్ పండితులు.

ఇప్పటికే శ్రీవిష్ణు సినిమాను ఆదరిస్తూ సక్సెస్‌ఫుల్‌ టాక్‌ అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు కూడా తెలియజేశాడని తెలిసిందే. సామజవరగమన గ్లింప్స్ వీడియో, టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేసి, మార్కెట్‌ను పెంచడంలో కీ రోల్‌ పోషించాయనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు మూవీ లవర్స్‌.

- Advertisement -

ఫన్‌, ఫ్యామిలీ, యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో సాగే ఈ చిత్రంలో బిగిల్‌ (విజిల్‌) ఫేం రెబా మోనికా జాన్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషించింది. సుదర్శన్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, వెన్నెల కిశోర్‌, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవీ ప్రసాద్‌, ప్రియ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో కలిసి హాస్య మూవీస్‌ బ్యానర్‌ పై రాజేశ్‌ దండా నిర్మించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు