Thursday, May 16, 2024

బీబీజీ బంగారు తల్లి కి సత్కారం

తప్పక చదవండి

బాలికా సాధికారత కార్యక్రమం ‘బీబీజీ బంగారు తల్లి’ని రాష్ట్రీయ గౌరవ్ అవార్డ్స్ వింటర్ ఎడిషన్‌తో సత్కరించారు. ‘బీబీజీ బంగారు తల్లి’ అనేది బిల్డింగ్ బ్లాక్ గ్రూపు ఫౌండేషన్ సామాజిక సేవలో ఒక భాగం. దీనిని బిల్డింగ్ బ్లాక్ గ్రూపు చైర్మన్ మల్లికార్జున రెడ్డి పదిహేడు సంవత్సరాలు క్రితం స్థాపించారు. రాష్ట్రీయ గౌరవ్ అవార్డ్స్ వింటర్ ఎడిషన్ అవార్డులు విభిన్న రంగాలలో అత్యుత్తమ విజయాలు సాధించిన వారికి అందజేస్తూ ఉంటారు. వింటర్ ఎడిషన్ అనేది సమాజం, సంస్కృతి, సమాజ అభివృద్ధిపై గణనీయమైన ప్రభావం చూపిన వ్యక్తులు, సంస్థలను గుర్తించే ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఈ అవార్డులు తెలంగాణ ప్రభుత్వం, సివ్వా సేఫ్టీ సొల్యూషన్స్ సహకారంతో అందజేస్తుంది. ఈ సందర్భంగా బిల్డింగ్ బ్లాక్ గ్రూపు చైర్మన్ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ బాలికా సాధికారత పట్ల బీబీజీ తిరుగులేని నిబద్ధతకు ఈ ముఖ్యమైన ప్రశంస నిదర్శనమన్నారు. ప్రతిష్టాత్మక రాష్ట్రీయ గౌరవ్ అవార్డ్స్ వింటర్ ఎడిషన్‌లో ఈ గుర్తింపు లభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. బీబీజీ బంగారు తల్లి అనేది లాభాపేక్షలేని సంస్థ అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో బాలికల విద్యకు విశేష కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న ఈ సంస్థ 2040 నాటికి ఇరవై లక్షల మంది ఆడపిల్లలకు సాధికారత కల్పించాలన్న దృఢ నిశ్చయంతో ఉందన్నారు. అందులో భాగంగా సురక్ష, స్వశక్తి, ఆహ్లాద, ప్రేరణ, భరోసా కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఈ అవార్డును హైదరాబాద్‌లోని ఎఫ్‌టీటీసీఐ రెడ్‌హిల్స్‌లో జరిగిన వేడుకలో అందజేశారన్నారు.‌

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు