Monday, April 29, 2024

కామారెడ్డిలో రోడ్డు విస్తరణ పనులు

తప్పక చదవండి
  • సొంతింటిని కూల్చిన ఎమ్మెల్యే రమణారెడ్డి

కామారెడ్డి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులు కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డిని ఓడించి సంచలనంగా మారిన బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ప్రజా సేవలోనూ తన మార్కు చూపిస్తున్నారు. తన గొప్ప మనసు చాటుకున్నారు. నియోజవర్గంలో రోడ్డు విస్తరణ కోసం ఏకంగా తన సొంత ఇంటినే కూల్చేస్తున్నారు. దీంతో కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డిపై అంతటా ప్రశంసలు కురుస్తున్నాయి. కామారెడ్డిలో రోడ్డు ఇరుకుగా ఉండడంతో విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుంది. దీంతో ఎమ్మెల్యే ఇంటి నుంచి పాత బస్టాండ్‌ వరకు రోడ్డు వెడల్పు కోసం అడ్డుగా ఉన్న నిర్మాణాలకు అధికారులు నోటీసులివ్వనున్నారు. రోడ్డును విస్తరించడానికి అడ్డుగా ఉన్న వాటిలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీ నివాసం కూడా ఉంది. అలాగే రెండు సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రమణారెడ్డి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కామారెడ్డి బరిలో నిలిచిన సీఎం అభ్యర్థులు కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డిని ఓడించారు. బరిలో అగ్ర నేతలు ఉన్నప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రచారం చేసిన రమణారెడ్డి చివరికి విజయాన్ని అందుకున్నారు. కాగా ఎన్నికల ప్రచారం సమయంలో తన సొంత డబ్బులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని రమణారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి రమణారెడ్డి గత కొన్నేళ్లుగా స్వచ్ఛంద సేవలో ప్రజలతో మమేకం అయ్యారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పలు పనులను చేపట్టారు. అందుకే ఆయనను కెసిఆర్‌, రేవంత్‌ రెడ్డిలు ఓడించలేక పోయింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు