Sunday, May 19, 2024

ఖరీదైన పట్టు పంచెలను ఆవిష్కరించిన రామ్ రాజ్ కాటన్..

తప్పక చదవండి
  • స్వచ్ఛమైన బంగారం పోగులతో తయారు చేసిన పంచెలు..
  • వివరాలు తెలిపిన చైర్మన్ కేఆర్ నాగరాజన్..

వివాహ వేడుకలు, కుటుంబ వేడుకలు, పర్వదినాల్లో మహిళలు మాత్రమే ప్రత్యేకంగా పట్టువస్త్రాలు ధరించాలని మన సంప్రదాయ పరిజ్నానం నిర్దేశించింది. కానీ, ఈ సంప్రదాయ కట్టుబాట్లు, నిబంధనలను దాటేసుకుని ‘రామ్‌రాజ్ కాటన్’ సాహసం చేసింది. పండుగలు, వివాహ, కుటుంబ వేడుకల్లో పురుషులు ధరించే పట్టు పంచెలు, పట్టు పంచెలు, పట్టు చొక్కాలు పరిచయం చేసింది. ‘ఇది అత్యంత ద్రుఢ విశ్వాసంతో వస్త్ర ఉత్పత్తి సౌందర్యాన్ని పునర్ నిర్వచించడంలో ఒక విప్లవాత్మకమైన అడుగు అని రామ్‌రాజ్ కాటన్ వ్యవస్థాపకులు, చైర్మన్ కేఆర్ నాగరాజన్ పేర్కొన్నారు. వినూత్న విజయోత్సవాన్ని ఆవిష్కరిస్తూ.. తాజాగా ‘రామ్‌రాజ్ కాటన్’ రూ.1,00,000 విలువైన పట్టు పంచెలను ఆవిష్కరించింది. మాంగళ్య షాపింగ్ మాల్ కు చెందిన కే నామశివయ్య రూ.లక్ష విలువైన పట్టు పంచెలను ఆవిష్కరించారు. తమ కస్టమర్లు అత్యంత ఉత్సాహంతో రామ్‌రాజ్ కాటన్’ పంచెలు కొనుగోలు చేసి ధరించడం పట్ల చైర్మన్ కేఆర్ నాగరాజన్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విన్ అమితానందం వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన బంగారం పోగులతో అత్యుత్తమంగా అలంకరించిన ఈ పంచెలు చేతి రాట్నాలతో, అత్యంత శ్రద్ధా భక్తులతో, ఎంతో అలంకార ప్రాయంగా ఉత్పత్తి చేశారు. విలాసవంతంగా కనిపిస్తున్న ఈ పట్టు పంచెలు సాటిలేని వైభవంతో ప్రకాశిస్తున్నాయి. ముఖ్యంగా రామ్‌రాజ్ కాటన్’ రూపొందించిన సంప్రదాయ పట్టువస్త్రాలకు పలు రాష్ట్రాల నుంచి ప్రశంసలు లభించాయి. అత్యంత అభిమానంతో బహు జనాదరణ పొందడం తమకు లభించిన అతి గొప్ప రాజ లాంఛనం అని రామ్‌రాజ్ కాటన్ పేర్కొంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సంస్థ డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశంలో రూ.లక్ష విలువ గల పట్టు పంచెలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ కేఆర్ నాగరాజన్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అశ్విన్ మాట్లాడుతూ ఈ పట్టు వస్త్రాలు ధరించడం ద్వారా లభించే శారీరక, మానసిక ప్రయోజనాలను వివరించారు. హైదరాబాద్‌లోని అన్ని రామ్‌రాజ్ షోరూమ్‌ల్లో ఈ పట్టు పంచెలు అందుబాటులో ఉంటాయని కేఆర్ నాగరాజన్ తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు