Saturday, May 18, 2024

కెనాడాకు తిరుగుముఖం పట్టిన కెనాడా ప్రధాని

తప్పక చదవండి

న్యూఢిల్లీ : జీ20 సదస్సు కోసం భారత్‌ వచ్చిన కెనాడా ప్రధాని విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రస్తుతం భారత్‌లోనే చిక్కుకుపోయారు. విమానంలో సాంకేతిక లోపాన్ని సరిదిద్దే ప్రయత్నాలు ఊపందుకోవడంతో మంగళవారం ఆయన కెనడాకు తిరుగుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు కెనడా నుంచి ట్రూడో కోసం బయలుదేరిన బ్యాకప్‌ విమానాన్ని లండన్‌కు దారిమళ్లించారు. అయితే ఈ విమానాన్ని ఎందుకు దారిమళ్లించారనే వివరాలు వెల్లడికాలేదు. ట్రూడో జీ20 సదస్సులో పాల్గొనేందుకు సెప్టెంబర్‌ 8న తన కుమారుడు జేవియర్‌తో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో సాంకేతిక లోపంతో మొరాయించిన విమానానికి సంబంధించి రీప్లేస్‌మెంట్‌ పరికరంతో మెకానిక్‌ను కెనడా నుంచి భారత్‌ పంపారు. విమానం అన్ని ఎయిర్‌ సేఫ్టే ప్రమాణాలతో సిద్ధమైతే ట్రూడో ఎయిర్‌బస్‌ విమానంలో కెనడా బయలుదేరతారని సమాచారం. విమానంలో సాంకేతిక లోపం పరిష్కారం కాకుండా, బ్యాకప్‌ విమానం అందుబాటులో లేని పక్షంలో ట్రూడో, ఆయన ప్రతినిధుల కోసం మరో జెట్‌ను కెనడా నుంచి పంపుతారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు