Sunday, May 19, 2024

6వ నుంచి 9వ తరగతి విద్యార్థులకు ‘తపాలాశాఖ’ స్కాలర్‌షిప్‌..

తప్పక చదవండి
  • ఎంపికైతే ఏటా రూ.6 వేల ఉపకార వేతనం..

న్యూ ఢిల్లీ: ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు తపాలాశాఖ దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన స్కాలర్‌ షిప్‌ కోసం పోటీ పరీక్షలు నిర్వహిస్తోంది. నేటితరం విద్యార్థుల్లో హిస్టరీ, స్పోర్ట్స్‌, విజ్ఞానం, సమకాలీన అంశాలు వంటి పలు అంశాలపై ఈ పోటీ పరీక్షలు ఉంటాయి. తపాలా బిళ్లల సేకరణ, అధ్యయనం (ఫిలాటలీ) వల్ల కలిగే ప్రయోజనాలను వివరించేందుకు ప్రతీ ఏటా తపాలాశాఖ దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన ఈ పోటీలను నిర్వహిస్తోంది. ఈ పోటీలో ఎంపికైతే ఎంపికైతే ఏటా రూ.6 వేల స్కాలర్‌షిప్‌ అందిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి తొమ్మదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైనా దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన పోటీ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 20వ తేదీలోపు ఆసక్తి కలిగిన విద్యార్థులు తమ పాఠశాల హెచ్‌ఎం పేరు మీద దరఖాస్తులు పంపవల్సి ఉంటుంది. వీటిని సంబంధిత రీజనల్‌ ఆఫీస్‌కు పంపించాలి. అందుకు సమీపంలోని తపాలాశాఖలో రూ.200 చెల్లించి పోటీ పరీక్ష రాసే విద్యార్థి పేరుతో గానీ, పాఠశాల హెచ్‌ఎంల పేరుతోగానీ ఫిలాటలీ ఖాతా/ఫిలాటలీ క్లబ్‌ అకౌంట్‌ తెరవాలి. ఇలా అకౌంట్‌ ఓపెన్‌ చెయ్యగానే రూ.180 విలువ చేసే తపాలా బిళ్లలు ఇస్తారు. ఇవి పోటీ పరీక్షలు రాసేందుకు విద్యార్ధులకు ఉపయోగపడతాయి. ఏయే తేదీల్లో పరీక్షలు ఉంటాయనే విషయాన్ని తపాలా అధికారులు ఆయా పాఠశాల హెచ్‌ఎంలకు తెలియజేస్తారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు