17 సెప్టెంబరును తెలంగాణ విలీనమన్నా..
విమోచనమన్నా.. విద్రోహమన్నా..
రజాకార్ల కర్కషత్వంలోను,
యూనియన్ సైనిక చర్యలోను,
సాయుధ రైతాంగ పోరులోను..
ప్రజల రక్తం ఏరులై పారింది..
మానాభిమానాలు ఫ్యూడల్ గడీలలో
బతుకమ్మలైనయి..
స్వతంత్ర భారతంలో కలిసినా..
ఆ తర్వాత స్వరాష్ట్ర పోరాటంతో
భౌగోళికంగా రాష్ట్రం ఏర్పడ్డా..
ఇంకా స్వేచ్ఛా, సమానత్వం అందని ద్రాక్షలే..
పార్టీలు స్వార్థ ప్రయోజనాల కోసం..
నేడు మళ్లీ భావోద్వేగాలు రెచ్చగొట్టకండి?
తెలంగాణ స్వరాష్ట్ర పోరులో
సమిధలైన నాటి, మొన్నటి
అమరుల ఆకాంక్షలు నెరవేర్చడమే
వారికి ఇచ్చే నిజమైన నివాళులు..
- మేదాజీ