Friday, May 3, 2024

త్యాగాలనుండే గొప్ప విజయాలు లభిస్తాయి..

తప్పక చదవండి
  • డీజీపీ అంజనీ కుమార్..
  • గోషా మహల్ స్టేడియంలో ఘనంగా పోలీసు అమరవీరుల దినోత్సవం..
    కార్యక్రమంలో పాల్గొన్న ఇతర పోలీస్ ఉన్నతాధికారులు..

హైదరాబాద్ : త్యాగాలనుండే గొప్ప విజయాలు లభిస్తాయని డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. పోలీసు అమర వీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గోషామహల్ స్టేడియంలో శనివారం ఉదయం నిర్వహించిన పోలీసు ఫ్లాగ్ డే కార్యక్రమానికి డీజీపీ అంజనీ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కానిస్టేబుల్ అధికారి నుండి పోలీస్ ఉన్నతాధికారి వరకు ప్రజల రక్షణకై నిరంతరం విధి నిర్వహణలో నిమగ్నమై ఉంటారని అన్నారు. పౌర రక్షణ విధుల్లో ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 189 మంది పోలీసులు అమరులయ్యారని వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో పోలీస్ శిక్షణ ద్వారా విశేష సేవలందించి ఇటీవల దివంగతులైన ఎం.ఎస్. భాటియా సేవలను గుర్తు చేస్తూ, దాదాపు 30 ఐ.పి.ఎస్ బ్యాసిలకు, అనేక ఎస్.ఐ బ్యాచిలకు శిక్షణ నివ్వడం ద్వారా సుశిక్షితులైన పోలీస్ అధికారులను తయారుచేశారని వారి సేవలను గుర్తు చేశారు. దేశంలోనే ఉత్తమ పోలీసింగ్ అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణా నిలిచిందని, ఇందుకు ఉదాహరణ షీ టీమ్ లు, భరోసా కేంద్రాల నిర్వహణ, పాస్ పోర్ట్ క్లియరెన్సులు, సీసీటీవీ ప్రాజెక్టు నిర్వహణ లను ప్రస్తావించారు. రాష్ట్రంలో మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో షీ-టీమ్, భరోసా కేంద్రాల నిర్వహణపై సుప్రీం కోర్టు కూడా ప్రశంచిందని డీజీపీ తెలిపారు. లాక్ డౌన్ లో ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ పౌరుల రక్షణకై పోలీసులు విధులు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. పోలీస్ పరేడ్ అనంతరం, డీజీపీ అంజనీ కుమార్ తోపాటు పలువురు రిటైర్డ్ డీజీపీలు, సీనియర్ పోలీసు అధికారులు, రిటైర్డ్ పోలీసు అధికారులు, అమర పోలీసుల కుటుంబసభ్యులు హాజరై విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ‘అమరులు వారు’ పుస్తకాన్ని అంజనీ కుమార్ ఆవిష్కరించారు. నగర పోలీస్ కమీషనర్ సందీప్ శాండిల్య, అడిషనల్ డీజీలు సౌమ్య మిశ్రా, శివధర్ రెడ్డి, సంజయ్ కుమార్ జైన్,అనీల్ కుమార్ మహేష్ భగవత్, శ్రీనివాస రెడ్డి, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ లతోపాటు పలువురు సీనియర్ పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు