Saturday, April 27, 2024

మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ పదవికి గండం…?

తప్పక చదవండి

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే మేడ్చల్ జిల్లాలోని పలు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ కి వ్యతిరేకంగా అవిశ్వాసం తీర్మానాలు ప్రవేశ పెట్టారు. తాజాగా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ మర్రి దీపిక నరసింహారెడ్డి పై కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం

చైర్మన్ పదివి కోసం విహార యాత్రలు
మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ మర్రి దీపిక నరసింహారెడ్డి తన పదవిని కాపాడుకోవడానికి నాన తంటాలు పడుతున్నారు. చైర్మన్ పదవికి గండం ఉందని ముందే గ్రహించిన చైర్మన్ భర్త మర్రి నరసింహారెడ్డి అవిశ్వాసం పెట్టకుండా కౌన్సిలర్ లను విహర యాత్ర తీసుకెళ్లారు. ఈ విహార యాత్రకు స్థానిక కౌన్సిలర్ లు తో పాటు మాజీ మంత్రి మల్లారెడ్డి ఉండడం విశేషం.

- Advertisement -

రహస్య మంతనాలు
మేడ్చల్ మున్సిపల్ పరిధిలో మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపిక అధ్యక్షతన సోమవారం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి కొంతమంది కౌన్సిలర్ హాజరు కాలేదు.మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ తో పాటు 18 మందికి కౌన్సిలర్ లు మేడ్చల్ మండల పరిధిలోని ఓ ప్రైవేట్ రిసార్ట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో రహస్య మంతనాలు జరుపుతున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ జంగయ్య యాదవ్ హాజరయ్యారు.

కాంగ్రెస్ పార్టీ కి ఛైర్పర్సన్ పదవి
మేడ్చల్ మున్సిపాలిటీ ఛైర్పర్సన్ పై కాంగ్రెస్ పార్టీ 18వ వార్డ్ కు చెందిన భవాని రాఘవేందర్ గౌడ్ ఎన్నిక చేయాలని జంగయ్య ప్రస్తావించినట్టు సమాచారం. దీనికోసం కౌన్సిలర్ల ముందు భారీ ఆఫర్ లను ప్రకటిచ్చిన తెలుస్తుంది. దీనిపై కౌన్సిలర్ చర్చించుకొని సాయంత్రం వరకు తమ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. మాజీమంత్రి మల్లారెడ్డి మున్సిపల్ ఛైర్పర్సన్ తన కౌన్సిలర్ల ఇతర పార్టీల కు వెళ్లకుండా ఎలా కాపాడుకుంటారో వేచి చూడాలి .

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు