Friday, May 17, 2024

మరోసారి చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్

తప్పక చదవండి
  • 45 నిమిషాల పాటూ భువనేశ్వరి, బ్రాహ్మణి, యనమల భేటీ
  • తాజా పరిణామాలను అడిగి తెలుసుకున్న టీడీపీ అధినేత
  • చంద్రబాబు ఆరోగ్యం కోసం నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు

రాజమండ్రి : రాజమహేంద్రవరం జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కుటుంబసభ్యులు మరోసారి కలిశారు. ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ములాఖత్‌ ద్వారా కలిశారు. సుమారు 45 నిమిషాల పాటు చంద్రబాబుతో వారు మాట్లాడారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై చంద్రబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది.

తప్పుడు కేసులో చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించారన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. చంద్రబాబు చాలా బాధతో ఉన్నారని.. పార్టీ కార్యకర్తలు ఎలా ఉన్నారని అడిగి తెలుసుకున్నారన్నారు. పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని తెలిసిందని.. ఆ వివరాలు ఆరా తీశారన్నారు. ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఆయన ప్రస్తావించారన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించామన్నారు. డీఐజీతో చంద్రబాబుకు అందిస్తున్న భద్రతపైనా ఆరా తీశామన్నారు.. ఆయన రూమ్‌లో ఏసీ లేదన్నారు. ఆయనకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు యనమల.

- Advertisement -

అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని ఆయన సతీమణి నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం రాజమండ్రిలోని శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయానికి నారా భువనేశ్వరి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. రాజమండ్రి నాళం భీమరాజు వీధిలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భువనేశ్వరి వెంట సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు