Thursday, May 16, 2024

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఇన్చార్జిగా నియమితులైన డాక్టర్ మొగుళ్ళ అశోక్ గౌడ్.

తప్పక చదవండి

హైదరాబాద్, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి.. వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ గౌడ్, తెలంగాణ టి.పీ.సి.సి. ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే లు తన సేవలు గుర్తించి కొల్లాపూర్ నియోజక వర్గం సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించడంపై మొగుళ్ళ అశోక్ గౌడ్ ఆనందం వ్యక్తం చేశారు.. దానికి తన శాయశక్తుల కార్యనిర్వహణ ఉంటుందని, పార్టీ ఆన్లైన్ మెంబర్స్ ని పెంచుతూ.. పార్టీ సంస్థాగత నిర్వహణ బాధ్యతగా చేస్తానని.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, సబ్బండ కులాలకు పార్టీకి ఆకర్షితులను చేస్తానని, తనకు బాధ్యత అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు డాక్టర్ మొగుళ్ళ అశోక్ గౌడ్..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు