Sunday, May 19, 2024

షీటీమ్స్‌తో మహిళల భద్రతకు మరింత భరోసా

తప్పక చదవండి
  • విద్యాసంస్థల వద్ద, రద్దీ ప్రదేశాల్లో షీటీమ్స్‌ నిరంతరం నిఘా
  • వివరాలు వెల్లడిరచిన ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ విష్ణు వారియర్‌
    ఖమ్మం : జిల్లాలో షీ టీమ్‌ సిబ్బంది మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న పోకిరీలను అదుపులోకి తీసుకొని వారి తల్లిదండ్రులు సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారని పోలీస్‌ కమిషనర్‌ విష్ణు యస్‌. వారియర్‌ తెలిపారు. ఆగష్టు నెలలో వచ్చిన పిర్యాదులలో ఎఫ్‌ ఐ ఆర్‌ లలో 2 పెట్టి కేసులు, నమోదు చేయడంతో పాటు ఇద్దరికి కౌన్సెలింగ్‌ ఇవ్వడం జరిగిందన్నారు.జిల్లాలో ఉన్న షీ టీమ్స్‌ బృందాలు ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ పాఠశాలల్లో, తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో, రెసిడెన్షియల్‌ స్కూల్‌ లలో కేజీబీవీ స్కూళ్లలో విద్యార్థిని విద్యార్థులకు ర్యాగింగ్‌, ఇవిటీజింగ్‌, పోక్సో,షీ టీమ్స్‌, యాంటీ హ్యుమెన్‌ ట్రాఫికింగ్‌ లపై నిత్యం అవగాహన కల్పిస్తున్నారని అన్నారు.మహిళలు ,బాలికల రక్షణ గురించి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా షీ టీమ్స్‌ ఏర్పాటు చేయడం ద్వారా మహిళలు, బాలబాలికలు, విద్యార్థిని విద్యార్థులకు రక్షణగా నిలుస్తూ సేవలు అందించడం జరుగుతుందన్నారు.మహిళలు బాలికలు విద్యార్థినిలు షీటీమ్స్‌ సేవలు వినియోగించుకోవాలని ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలిపారు.ఎలాంటి వేధింపులకైన గురయ్యే మహిళలు షీటీమ్‌ కు పిర్యాదు చేయదలచుకునే మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, మహిళల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అంతే కాకుండా మహిళలు అత్యవసర పరిస్థితుల్లో డయల్‌-100 కు కాల్‌ చేసి తక్షణ పోలీస్‌ సహాయం పొందాలని సూచించారు.ఎవరైనా వేధించిన రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడిరచిన వెంటనే 100, జిల్లా షీ టీమ్‌ నెంబర్‌ 8712659222 కు పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు.మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే షీ టీమ్‌ వాట్సప్‌ నెంబర్‌ కు ఫోన్‌ చేసి తెలపాలని,మీకు తెలియకుండా షీ టీమ్‌ పోలీసులు విద్యాసంస్థల వద్ద,రద్దీ ప్రదేశాల్లో సివిల్‌ డ్రస్‌ లలో నిత్యం తిరుగుతూ నిఘా ఉంటుంది అని తెలిపారు.షీ టీమ్స్‌ సిబ్బంది ప్రతిరోజు పాటశాలను ,కళాశాలను సందర్శించి విద్యార్థినీ విద్యార్థులకు బాలికలకు షీటీమ్‌ దాని యొక్క ప్రాముఖ్యత నిర్వహించే విధుల గురించి, మానవ అక్రమ రవాణా, ఫోక్సో చట్టాల గురించి, బాల్య వివాహాలు దాని యొక్క పరిణామాల గురించి,ఈవిటిజింగ్‌,గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ తదితర అంశాల గురించి, సోషల్‌ మీడియా దాని యొక్క పరిణామాల గురించి, సైబర్‌ క్రైమ్స్‌, డయల్‌ 100 ప్రాముఖ్యత, సమాజ రుక్మతల గురించి సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి నుండి ఎలా రక్షణ పొందాలి అనే అంశాల గురించి, సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌, సెల్ఫ్‌ డిఫెన్స్‌, మహిళల పిల్లల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సోషల్‌ మీడియా వల్ల జరుగు నష్టాలు లాభాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు