Monday, May 13, 2024

బిల్లులన్నీ ఆమోదిస్తాం

తప్పక చదవండి
  • పెండిగ్‌ బిల్లులపై వివరణ ఇచ్చిన రాజ్‌ భవన్‌..
  • రెండు సెషన్స్‌ అసెంబ్లీ సమావేశాల్లో 11 బిల్లులు
  • ఇప్పటికే మూడు బిల్లులు ఆమోదించామని స్పష్టం
  • మరో 2 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు..
  • మిగిలిన బిల్లులు మరో ఐదు రోజుల్లో ఆమోదిస్తామని సమాచారం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో గత కొంతకాలంగా ప్రగతి భవన్‌, రాజ్‌భవన్‌ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా పెండిరగ్‌ బిల్లుల అంశపై సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై మధ్య విభేదాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. పెండిరగ్‌ బిల్లులను గవర్నర్‌ ఆమోదించడం లేదని బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఆమెపై విమర్శలు చేసింది. అలాగే ఇందుకు సంబంధించిన అంశంపై సుప్రీం కోర్టులో కూడా వాడీవేడిగా వాదనలు జరిగాయి. ఇప్పటికీ ఆ వివాదం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకే గవర్నర్‌ బిల్లులను పెండిరగ్‌లో పెడుతున్నారంటూ అధికార పార్టీ నేతలు ఆమెపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఈ పెండిరగ్‌ బిల్లుల అంశంపై రాజభవన్‌ వివరణ ఇచ్చింది. గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ వద్ద ఎలాంటి బిల్లులు పెండిరగ్లో లేవని స్పష్టం చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం రెండు సెషన్స్‌ అసెంబ్లీ సమావేశాల్లో 11 బిల్లులను తీసుకొచ్చింది. అందులో రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాల్లో నియామకాలు చేపట్టేందుకు ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేయడం, సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను తెలంగాణ అటవీ విశ్వ విద్యాలయంగా మార్చడం, రాష్ట్రంలో మరి కొన్ని ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చేలా ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ, జీహెచ్‌ఎంసీ చట్టం, పురపాలక చట్టం, అజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ, పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్ట సవరణ, జీఎస్టీ చట్ట సవరణ బిల్లులు సెప్టెంబర్‌ 13న ఉభయ సభల ఆమోదం పొందాయి. వీటిలో జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదం తెలపగా.. మిగిలిన 10 బిల్లులు పెండిరగ్‌ లో ఉన్నాయి. చివరికి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేయడంతో ఆమె మూడు చట్టాలను ఆమోదించింది, అయితే మరో రెండిరటిని రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపారు. గవర్నర్‌ ఆమె ఆమోదం కోసం రెండు బిల్లులను రాష్ట్రపతికి పంపారు మరియు మరో మూడిరటిని తన వద్ద ఉంచుకున్నారు. గవర్నర్‌ ఆమోదించిన బిల్లులు, ప్రభుత్వానికి తిరిగి పంపిన బిల్లులు, రాష్ట్రపతి భవన్‌కు పంపిన బిల్లులపై స్పష్టత లేదు. తెలంగాణ ఫారెస్ట్‌ యూనివర్సిటీ బిల్లు, జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ సవరణ బిల్లు, తెలంగాణ మహిళా యూనివర్సిటీ బిల్లులను ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే. అజామాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా సవరణ బిల్లు, తెలంగాణ మోటార్‌ వెహికల్‌ ట్యాక్స్‌ సవరణ బిల్లులను ఆమె రాష్ట్రపతికి పంపినట్లు సమాచారం. ఇప్పుడు పెండిరగ్‌ లో ఉన్న బిల్లులను కూడా మరో ఐదు రోజుల్లో ఆమోదిస్తామనే సమాచారం అందడంతో.. ప్రభుత్వ వర్గాలు కూడా సంతృప్తిగా ఉన్నాయి. ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య గ్యాప్‌ తగ్గిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇటీవల బీజేపీ , బీఆర్‌ఎస్‌ పెద్దగా విమర్శించుకోవడం లేదన్న రాజకీయ పరిణామాల మధ్య తాజాగా గవర్నర్‌ నిర్ణయం …ఆసక్తికరంగా మారింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు