Sunday, July 21, 2024

ప్రధానికి వర్తించిన చట్టం.. పాత్రికేయులకు వర్తించదా.. ?

తప్పక చదవండి
  • ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవినుంచి బర్తరఫ్ చేయాలి..
  • ఆయన చేసిన అనుచిత వాఖ్యలపై ముదిరాజులకు క్షమాపణ చెప్పాలి..
  • ఘటనపై ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు స్పందించడానికి జంకుతున్నారా..?
  • పలుమార్లు నోరుపారేసుకున్న కౌశిక్ రెడ్డిని ప్రభుత్వం ఎందుకు వెనుకేసుకొస్తుంది..?
  • ప్రభుత్వం , బీసీ కమీషన్ సుమోటాగా ఆయనపై కేసును నమోదు చేయాలి
  • ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ డిమాండ్..

ఇంటి పేరును తప్పుగా పిలిచాడని కేసులు పెట్టి .. ప్రజాస్వామ్య పద్దతిలో గెలిచిన ఒక ఎంపీనే తొలగించగలిగిన చట్టాలున్న ఈ దేశంలో ఒక కులాన్నికించపరిచి.. ఒక సామాన్య జర్నలిస్టుని అతని తల్లిని సైతం వాడని భాషలో తిట్టిన ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్న పాలకుల పక్షపాత ధోరణిని చూస్తూ ఏమనాలో అర్థంకావడం లేదు. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కర్ణాటకలోని కోలార్‌లో నిర్వహించిన సభలో రాహుల్‌ గాంధీ ప్రసంగిస్తూ ‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో..’ అని వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ.. సూరత్‌ న్యాయస్థానంలో దీనిపై పరువు నష్టం దావా వేశారు. దీనిపై నాలుగేళ్లుగా విచారణ జరిపిన న్యాయస్థానం.. అప్పట్లో న్యాయస్థానం ఆయణ్ని దోషిగా తేల్చి, రెండేళ్ల జైలు శిక్ష విధించింది అంతేకాకుండా సూరత్‌ కోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకొని లోక్‌సభ సెక్రెటేరియట్‌ రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు కూడా వేసింది. ప్రధానిపై నోరుపారేసుకోవడం క్షమించరాని నేరమే.. ఇదే నేరాన్ని ఒక ప్రజాప్రతినిధి చేస్తే ఎందుకు చట్టం జోక్యము చేసుకోవడంలేదు. బరితెగించి మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి ఇవే చట్టాలు ఎందుకు వర్తించడంలేదు..? న్యాయవ్యవస్థ సమాధానం చెప్పాలి..

హైదరాబాద్, జూన్ 24 (ఆదాబ్ హైదరాబాద్ ) :
బూతులు అతగాడిని చూసి భయపడుతాయి.. తిట్లు ఆయన నోటినుంచి వచ్చే దారుణమైన మాటలను విని పారిపోతాయి.. అతనే సోకాల్డ్ రాజకీయ రౌడీగా పేరుతెచ్చుకున్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి.. ఈయన గురించి ఎంత చెప్పుకున్నా, ఈయన గారి చరిత్రను ఎంత చూసినా అంతు అనేది ఉండదు.. ఇక
నోరు మంచిదయితే ఊరు మంచిదవుతందట .. నిత్యం ఎదో ఒక చోట చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా నోటికి ఎంతొస్తే అంత ఎవ్వరిని పడితే వారిని పిచ్చిగా తిడుతూ.. వివాదాలకు తానే కేంద్రబిందువుగా.. ఒక కేరాఫ్ అడ్రస్ గా బ్రాండ్ ఇమేజ్ ను మూట గట్టుకున్న బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఫై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తిట్టనిదే పూటగడవదన్నట్టుగా నిత్యం ఎదో ఒక చోట ఎవరినో ఒక్కరిని తిడుతూ.. వ్యక్తులు ఎంత పెద్ద హోదాలో ఉన్నప్పటికీ కనీస విజ్ఞత కోల్పోయి నోటికి ఎంతొస్తే అంత సమాజంలో వాడకూడని భాషను వాడుతూ వార్తల్లో విమర్శలను మూటగట్టుకుంటున్న కౌశిక్ రెడ్డి వ్యవహారంపై బి ఆర్ ఎస్ పెద్దలు ఎందుకు జోక్యం చేసుకోవడంలేదో అర్ధం కావడం లేదు. తాను అన్న మాటలు, తిట్టిన తిట్లు రికార్డింగుల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా .. ఆమాటలు తనవి కావని తాను అన్నానని నిరూపిస్తే ముక్కు భూమికి రాస్తానని చెబుతూ .. బుకాయిస్తున్న పాడి కౌశిక్ రెడ్డి ని ఏమనాలో అర్ధం కావడంలేదు.

- Advertisement -

ముదిరాజ్ లను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన బి అర్ ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఫై చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. శనివారం ముదిరాజ్ జర్నలిస్ట్ సంఘం నాయకులు కుత్బుల్లాపూర్ లోని షాపూర్ నగర్ చౌరస్తాలో పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాసాని వీరేష్ ముదిరాజ్ రాజ్యాంగబద్దంగా ప్రజలకు సమన్వయ పాలన అందించే విధంగా పెద్దల సభలో ఎమ్మెల్సీ స్థాయిలో ఉండి కూడా ముదిరాజ్ కులస్తులను అవహేళన చేసి మాట్లాడటం మంచి పద్దతి కాదని మండిపడ్డారు. కనీస అవగాహన లేని వ్యక్తి కి ఎమ్మెల్సీ పదవిని బి అర్ ఎస్ పార్టీ ఎలా కట్టబెట్టిందని ప్రశ్నిచారు. ఇలాంటి రౌడీలను పదవి నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.. ఇప్పటికైనా బి అర్ ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ముదిరాజ్ లకు క్షమాపణ చెప్పకపోతే, బీసీ సంఘాలన్నిటినీ సంఘటితం చేసి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని హెచ్చరించారు. అవగాహన లేని నాయకుడిని వెంటనే ఎమ్మెల్సీ పదవి నుండి బర్తరఫ్ చేయాలని ముదిరాజ్ సంఘం తరుపున బీ ఆర్ ఎస్ అధినాయకత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిఫై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ సంఘం సభ్యులతో కలిసి కాసాని వీరేష్ ముదిరాజ్ పోలీసులకు పిర్యాదు చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు