Tuesday, July 16, 2024

కేపీ చౌద‌రీ టూ తేజ చౌద‌రీ..

తప్పక చదవండి
  • డ్ర‌గ్స్ మాఫియా కూక‌టి వేళ్ల‌ను పెకిలిస్తున్న అధికారులు..
  • మ‌త్తుకి కేరాఫ్ ఆడ్ర‌స్ గా గ‌చ్చిబౌలి ఇన్ఫినిటీ ఫుడ్ కోర్టు..
  • ర‌ఘు తేజ డ్ర‌గ్స్ దందా గురించి ముందే హెచ్చరించిన ఆదాబ్..
  • కేపీ చౌదరి కస్టడీ రిపోర్ట్ తో మ‌రోసారి విచార‌ణ‌కు ర‌ఘు తేజ‌..
  • విచార‌ణ పేరుతో రెడ్ హ్యాండెడ్ అంటూ డ్రామా..?
  • అరెస్ట్ చేయ‌కుండా డ్ర‌గ్స్ మూలాలు ఎలా భ‌య‌ట‌ప‌డుతాయి..?
  • తేజ చౌద‌రీ తెరవెన‌క డ్ర‌గ్స్ లీల‌లు బయటపడేది ఎప్పుడు.. ?
  • ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్న స్థానిక పోలీసులు.. !
  • డ్రగ్స్ నీడలో మునిగి తేలుతున్న ప్రముఖ నటీ నటులు, సెలెబ్రెటీలు..
  • ఆందోళన కలిగిస్తున్న వివిధ వార్తా కథనాలు..

హైదరాబాద్ లో డ్రగ్స్ మాఫియా వ్యవహారాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.. ఒక లింక్ ను పట్టుకుంటే మరో లింక్ బయటపడుతోంది.. సినీ నిర్మాత కేపీ చౌదరిని కదిలిస్తే అతనితో రఘు తేజ చౌదరి బండారం బయటపడింది.. కాగా డ్రగ్స్ దందాలో ఇంకెందరు ములాఖత్ అయి ఉన్నారు అన్నది తేలాల్సి ఉంది..
హైద‌రాబాద్ లో డ్ర‌గ్స్ మాఫియా పడగలిప్పుతోంది.. క‌బాలి సినిమా ప్రొడ్యూస‌ర్ కేపీ చౌద‌రీని అరెస్ట్ చేస్తే.. 12 మంది కాల్ డేటా బయటప‌డింది. గ‌తంలో ఎన్నో కేసుల్లో క‌న్య్జుమ‌ర్ గా మాత్ర‌మే చూపించిన ర‌ఘు తేజ చౌద‌రీని మాత్రం ఇంత వ‌ర‌కు అరెస్ట్ చేయ‌డం లేదు. రెడ్ హాండెడ్ గా ప‌ట్టుకోవాలంటూ పోలీస్ ఉన్నతాధికారుల‌ను త‌ప్పుదారి ప‌ట్టిస్తున్న పోలీసులు ఉండ‌టంతో అస‌లు మాఫియా వెలుగు చూడటం లేద‌ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

హైదరాబాద్, 24 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
మే 5 న రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్ లో అరెస్ట్ అయిన డ్రగ్స్ మాఫియా గ్యాంగ్ లో ర‌ఘు తేజ పేరు బయటకు వ‌చ్చింది. తాజాగా కేపీ చౌద‌రీ క‌స్ట‌డీ రిపోర్ట్ లో కేపీ చౌద‌రీకి డ్ర‌గ్స్ విక్ర‌యించిన‌ట్లు ఒప్పుకున్నారు. ఏడాదిన్న‌ర‌లోనే 202 సార్లు గోవాకు ఫ్లైట్ లో వెళ్లి బ‌స్సులో వ‌చ్చిన ర‌ఘు తేజను మాత్రం వ‌దిలివేయ‌డం అశ్చ‌ర్యానికి గురిచేస్తుంది. అయితే పోలీసుల‌తో పాటు మీడియా ర‌ఘుతేజపై ఫోక‌స్ చేయ‌క‌పోవ‌డంపై అత‌ను ఎలా డ్ర‌గ్స్ మేనేజ్మెంట్ చేస్తున్న‌డో ఇట్టే అర్ధమై పోతోంది..

- Advertisement -

రఘు తేజను అరెస్ట్ చేస్తేనే హైద‌రాబాద్ డ్ర‌గ్స్ మూలాలు బట్టబయలు :
రాయ‌దుర్గం పోలీసులు ర‌ఘు తేజ‌ని విచార‌ణ పేరుతో ఇప్ప‌టికి 15 సార్లు పిలిపించారు.. కానీ ఎలాంటి కొత్త విష‌యాల‌ను తెలుసుకున్నట్లు వారు వెల్లడించలేదు.. అయితే తాజాగా కేపి చౌద‌రీని గోవాలో అరెస్ట్ చేశారు. క‌స్ట‌డీలోకి తీసుకుని విచారిస్తే తేజ చౌద‌రీ పేరు మ‌రోసారి బయటకు వ‌చ్చింది. మ‌ళ్లీ విచార‌ణ పేరుతో పిలిచి రాచ‌మ‌ర్యాద‌లు చేస్తున్నారు పోలీసులు. నెల‌కు రూ. 2 కోట్ల లాభాల‌తో ఇన్పినిటీ ఫుడ్ కోర్టు నడిచిన‌ట్లు చెప్పుకున్నారు. పెద్ద పెద్ద రూమ్స్ తో ర‌హస్య ప్ర‌దేశాల‌ను నిర్మించారు. అక్క‌డే స్టూడెంట్స్ కి డ్రగ్స్ అల‌వాటు చేసి.. పెద్ద పెద్ద నాయ‌కుల వ‌ద్ద‌కు పంపేవాడ‌ని అరోప‌ణ‌లు సైతం ఉన్నాయి. అయితే కొన్ని కేసుల‌తో ఆ ఫుడ్ కోర్టు మూసివేశారు. అయినా అక్కడ దందా ర‌హస్యంగా న‌డుస్తునే ఉంద‌ని అరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే ఫుడ్ కోర్టు నిర్వ‌హకుడు కోట్లాది రూపాయ‌లు పెట్టి న‌డిపించారంటే.. అది క‌స్ట‌మ‌ర్స్ కి చేర‌కుండా ఉండ‌లేద‌ని అర్ధం అవుతోంది.. ప్ర‌తి ప‌బ్ కి ఉచితంగా, ఎప్పుడంట‌టే అప్పుడు వెళ్లే ర‌ఘు తేజ ఫ్యామిలీని కేవ‌లం వినియోగ‌దారులుగా మాత్ర‌మే చూడ‌టంపై అనేక అనుమానాలకు తావిస్తోంది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు